ముడుపులతో జల్సా..
రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి వ్యాపార వర్గాల నుంచి భారీగా ముడుపులు వెళ్తుంటాయనే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే వ్యాపారులు రైల్వేస్టేషన్ నుంచి ఎంత భారీ సరుకు నిల్వలు తీసుకొచ్చినా వారి జోలికి వెళ్లరనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆ శాఖ దిగువస్థాయి సిబ్బంది ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తించి అటు వ్యాపారులకు, ఇటు అధికారులకు మధ్య వారిధిగా ఉండి ముడుపులు సర్దుబాటు చేసేవాడనే విమర్శలు ఉన్నాయి. అయితే స్థాయికి మించి వసూళ్లకు దిగటంతో వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించి పట్టించారనే కొంతమంది ఉద్యోగులే చెబుతున్నారు.


