విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
విజయవాడ నగరంలో 2.5 లక్షల మందికిపైగా కొండలపైనే నివాసం తరచూ ప్రమాదాలతో అల్లాడుతున్న కొండ ప్రాంత వాసులు పేదల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం ఇటీవల వర్షాలతో మూడు ప్రాంతాల్లో జారిన కొండచరియలు ఆమోదం పొందినా మొదలుకాని రక్షణ గోడల నిర్మాణం
తరచూ ప్రమాదాలు
ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఎన్టీఆర్ జిల్లా
మంగళవారం శ్రీ 25 శ్రీ నవంబర్ శ్రీ 2025
విజయవాడలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్పేస్ ఆన్ వీల్స్‌కు విశేష స్పందన లభించింది. ఈ ప్రదర్శనను వివిధ పాఠశాలల విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
మైలవరంలో సోమవారం రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల్లో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): డిజిటల్ అరెస్ట్ అనేది లేనేలేదని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. సీపీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మొదలైన నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా ‘సైబర్ సురక్ష’ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించారు. అందులో భాగంగా సైబర్ నేరాలకు సంబంధించి మోసపో యిన వారిలో అధికంగా సీనియర్ సిటిజన్లు ఉండటంతో సీపీ కార్యాలయంలో వృద్ధులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారని, సైబర్ నేరాలు పెనుసవాలుగా మారాయని, వాటిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీడియో కాల్ చేసి అరెస్టు చేస్తున్నట్టు బెదిరించినప్పుడు భయపడవద్దన్నారు. సీబీఐ, పోలీసు, కస్టమ్, ఈడీ, జడ్జీలు వీడియో కాల్‌లో అరెస్టు చేయరని వివరించారు. బాధితులు వెంటనే పోలీసులను సంప్రదిస్తే ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ నగదు బదిలీ చేస్తే 24 గంటల్లోపు సమీప పోలీసులకు లేదా సైబర్ సెల్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. డిజిటల్ అరెస్టుపై ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయాలని కోరారు. ఈ సదస్సులో సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న, ఏసీపీలు రాజశేఖర్, బానుప్రకాష్‌రెడ్డి, సీపీ గుణరామ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేవి నగరం మధ్యలో విస్తరించి ఉన్న కొండప్రాంతాలు. ఆ ప్రాంతాల ప్రజలు కొండంత భయంతో జీవనం కొనసాగిస్తున్నారు. నగరంలోని మూడు నియోజకవర్గాల్లో ఉన్న కొండ ప్రాంతవాసులు వర్షం పడితే ఎక్కడ కొండ చరియలు విరిగి పడతాయోనని అనుక్షణం భయపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొండ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యా యని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
20 డివిజన్లలో కొండప్రాంతాలు
నగరపాలక సంస్థ పరిధిలో 64 డివిజన్‌లు ఉన్నాయి. సుమారు 20 డివిజన్లలో కొండ ప్రాంతాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంతో పాటుగా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ఆయా కొండ ప్రాంతాల్లో సుమారుగా రెండున్నర లక్షల మందికిపైగా ప్రజలు నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అత్యధి కంగా పశ్చిమ నియోజకవర్గంలోని మల్లికార్జునపేట, కొత్తపేట, ఆంజనేయవాగు, చిట్టినగర్, లంబాడీ పేట, పాలప్రాజెక్ట్, కబేళా, రామరాజ్యనగర్, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్ తదితర ప్రాంతాలకు సమీపంలోని కొండలపై నివాసాలు ఉన్నాయి. నగరంలో నివాస స్థలాల ధరలు ఎక్కువగా ఉండటం, ఇళ్ల అద్దెలు సైతం భారీగా ఉండటంతో పేద ప్రజలు కొండప్రాంతాల్లో నివసించేందుకు మొగ్గుచూపుతున్నారు. కొండ ప్రాంతాల్లో రేకులతో లేదా రెండు గదులతో పక్కా భవనాలు నిర్మించుకుని కుటుంబాలతో నివసిస్తున్నారు.
ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యం వీడని ప్రభుత్వం
కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పలువురి ప్రాణాలు పోతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. మూడు నియోజకవర్గాల్లోని కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ జారిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా మొగల్రారాజపురంలోని పలు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై స్థానికులు మండి పడుతున్నారు.
ఆమోదం పొందినా అమలేదీ?
నగరంలోని పలు కొండ ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి నగరపాలకసంస్థ కౌన్సిల్‌లో ఆమోదం లభించింది. అయితే పనులు మాత్రం ప్రారంభంకాలేదు. రక్షణ గోడల నిర్మాణంలో మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల పనులను ప్రారంభించినా మధ్యలో నిలిపివేశారని పేర్కొంటున్నారు. నిధులు లేవని, ప్రభుత్వం నుంచి స్పష్టత లేదనే పలు కారణాలు చూపుతూ రక్షణ గోడల నిర్మాణాలను నిలిపివేస్తున్నారని మండిపడుతున్నారు.
7
నగరంలోని మూడు నియోజకవర్గ పరిధుల్లోని కొండ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీ వర్షం కురిసిన సమయంలో కొండ చరియలు విరిగి పడటం, కొండరాళ్లు జారిపడటం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ కొండచరియలు విరిగిపడితే పేదల ఇళ్లు ధ్వంసం కావడంతోపాటు, వాటిలో నివసిస్తున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు. మోంథా తుపాను సమయంలో కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గొల్లపాలెంగట్టు, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో కొండ చరియలు జారిపడ్డాయి. రక్షణ గోడలు (రిటైనింగ్ వాల్స్) దెబ్బతిని కిందకుజారాయి. తూర్పు నియోజకవర్గంలోనూ కొండపైన రక్షణ గోడలు జారాయి. వాటికి ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. గడచిన ఆరు మాసాలుగా ప్రతి నెలలోనూ ఒకటి రెండు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన చాలా సంద ర్భాల్లో ప్రాణనష్టం సైతం సంభవించిన దాఖలాలు ఉన్నాయి.
చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోంది. పాలకుల తీరుతో మునిసిపల్ అధికారులు ఏ పనులూ చేపట్టడం లేదు. చాలా కొండ ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం ఉన్నా పనులు ప్రారంభం కావటంలేదు. టెండర్లు పిలవటం లేదు. ఎప్పుడు వర్షం పడినా కొండ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఉన్నతాధికారులు, కూటమి ప్రభుత్వ పాలకులు స్పందించాలి. నగరంలోని కొండ ప్రాంతాల్లో ఉన్న తక్షణం రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలి.
– బోయి సత్యబాబు,
సీపీఎం, పశ్చిమ నగర కార్యదర్శి
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


