చెల్లించాల్సిన ఫీజు వివరాలు..
పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లకు కలిపి పరీక్ష ఫీజు రూ.125లు చెల్లించాలి.
ఫెయిలైన విద్యార్థులు మూడు లేదా అంతకన్నా తక్కువ సబ్జెక్ట్‌లకు రూ.110, మూడు లేదా అంతకన్నా అధికంగా ఎక్కువ సబ్జెక్ట్‌లు ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించాలి.
వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫీజుకు అదనంగా మరో రూ.60లు చెల్లించాలి.
తక్కువ వయస్సున్న విద్యార్థులు (అండర్ ఏజ్ స్టూడెంట్స్) ఫీజుగా రూ.300 చెల్లించాలి.
చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు. సదరం సర్టిఫికెట్ లేనివారు సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగం పంపించిన ఫార్మాట్‌లో సివిల్ సర్జన్ ధ్రువీకరించిన పత్రాన్ని సబ్మిట్ చేసే వీలును ప్రభుత్వం కల్పించింది.
పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల అపరాధ రుసుం లేకుండా 25వ తేదీ లోపు చెల్లించాలి ఎన్టీఆర్ జిల్లాలో 27,797మంది పదో తరగతి విద్యార్థులు
ఫీజు అధికంగా వసూలు చేస్తే చర్యలు..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షల ప్రక్రియలో తొలి అంకానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. 2026 మార్చిలో జరిగే పరీక్షలకు సంబంధించి ఈ నెల 13 నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. 25వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన జిల్లాలోని ఉన్నత పాఠశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న రెగ్యులర్, ఫెయిల్ అయిన అభ్యర్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది.
అపరాధ రుసుంతో..
పదో తరగతి ఫీజు చెల్లించే అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించుకోవచ్చు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అదే తేదీ లోగా నామినల్ రోల్స్ పూర్తి చేసి ఆ తరువాత పాఠశాల లాగిన్ లోని లింక్ ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా కానీ, చలానా ద్వారా కానీ పరీక్ష ఫీజు చెల్లిస్తే నిరుపయోగమవుతుందని అధికారులు పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకూ చెల్లించవచ్చు. డిసెంబర్ నాలుగు నుంచి పదో తేదీ వరకూ రూ.200 అపరాధ రుసుంతో చెల్లించవచ్చు. అదేవిధంగా డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకూ రూ.500 అపరాధ రుసుంతో చెల్లించే వీలుంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రికగ్నైజేషన్ పెండింగ్ ఉన్న పాఠశాలల ఆన్‌లైన్ లాగిన్స్ అందుబాటులో ఉండవు. గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసుకున్న పాఠశాలలు సంబంధిత డీఈవో కార్యాలయంలో సంప్రదించి లాగిన్‌ను ఎనేబుల్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లోనే..
పూర్తి చేసిన దరఖాస్తులన్నీ ఆన్‌లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు వివరాలను నామినల్ రోల్స్‌కు ప్రాతిపదికన తీసుకుంటారు. తప్పొప్పులకు ప్రధానోపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మేనేజ్‌మెంట్ బాలురు బాలికలు మొత్తం
ఏపీ మోడల్ స్కూల్స్ 65 63 128
ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 128 398 526
ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ 52 193 245
బీసీ వెల్ఫేర్ 80 0 80
కేజీబీవీస్ 0 110 110
ఎంపీపీ జెడ్‌పీపీ 3,157 3,502 6,659
మునిసిపల్ 1,231 1,277 2,508
ప్రైవేట్ ఎయిడెడ్ 350 560 910
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 8,896 7,452 16,348
ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్(బ్‌లైండ్) 31 16 47
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 11 2 13
(డఫ్ అండ్ డంబ్)
రాష్ట్ర ప్రభుత్వం 143 40 183
టీడబ్ల్యూ ఆశ్రమ స్కూల్ 40 0 40
మొత్తం 14,184 13,613 27,797
జిల్లాలోని వివిధ మేనేజ్‌మెంట్ స్కూల్స్‌లో
పదో తరగతి విద్యార్థుల సంఖ్య
ప్రభుత్వ పరీక్షల విభాగం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. దాని ప్రకారం పరీక్ష ఫీజులను చెల్లించాలి. నిర్ణయించిన ఫీజుల కన్నా అధికంగా వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే చెల్లించాలి.
– యూవీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లా
‘పది’కి సన్నద్ధం


