విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
మావోలకు పీఎస్‌లోనే వైద్య పరీక్షలు
మిస్టరీగా కానూరులోని మావోయిస్టుల షెల్టర్
భవనంలో కదలికలే లేవు..
కానూరు దాకా ఎలా?
ప్రత్యక్ష సాక్షులు ఇలా..
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
సుబ్రహ్మణ్యుని సేవలో..
పుస్తక పఠనం అవసరం
ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 20 శ్రీ నవంబర్ శ్రీ 2025
u8లో
● బస్తర్ నుంచి కానూరుకు
మావోలు ఎలా వచ్చారు?
● 28 మంది మావోల కదలికలు
గుర్తించని స్థానికులు
● నంబర్ లేని జీప్‌లో వచ్చి ఆహారం
ఇచ్చిన వ్యక్తి ఎవరు?
● దేవ్‌జీ ఎక్కడ?
పెనమలూరు: కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు షెల్టర్ తీసుకోవటం మిస్టరీగా మారింది. పైగా వసతులు లేని భవనంలోని పైన ఒకే ఫ్లోర్‌లో 28 మంది మావోలు ఎలా ఉన్నారు? వారికి నంబర్ లేని జీప్‌లో వచ్చి మూడు పూటలా ఆహారం ఇచ్చింది ఎవరు? మావో కార్యదర్శి తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ) అంగరక్షకులు పట్టుబడ్డారని పోలీసులు చెబుతుండగా.. అసలు దేవ్‌జీ ఏమయ్యారు? ఇలా అనేక శేష ప్రశ్నలకు పోలీసు అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో కానూరులో మావోయిస్టుల షెల్టర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానూరు ఆటోనగర్‌లో భవనంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 28 మందిని అరెస్టు చేశారు. వీరంతా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా దళ సభ్యులేనని పోలీసులు తెలిపారు. అందులో 9 మంది మావో కార్యదర్శి తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ) అంగరక్షకులు అని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే మావోయిస్టులు పట్టుబడిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌరహక్కుల సంఘ నేతలు కూడా ఖండిస్తున్నారు.
కానూరు ఆటోనగర్‌లో భవనంలోకి మావోయిస్టులు ఎలా వచ్చారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ నుంచి ఏవోబీ మీదుగా దాదాపు 600 కిలోమీటర్లు ప్రమాణించి కానూరుకు 28 మంది మావోలు రావడం అంటే మాటలు కాదు. పైగా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేయగా భవనంలో ఉన్న మావోయిస్టులు అసలు ఏమాత్రం ప్రతిఘటించలేదు. ఎటువంటి ఫైర్ కూడా జరగలేదు.. పోలీసుల జాయింట్ ఆపరేషన్ చాలా తేలికగా ముగిసింది.
భవనంలో 28 మంది మావోయిస్టులు తల దాచుకున్నా.. ఎక్కడా కదలికలు లేవని స్థానికులు తెలిపారు. ఏనాడు ఒక్కరు కూడా భవనం నుంచి బయటకు రాలేదని చెబుతున్నారు. నంబర్ ప్లేట్ లేని జీప్‌లో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మూడు పూటలా సంచుల్లో ఆహారం ఇచ్చారని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. 10 రోజుల నుంచి మాత్రమే జీప్‌లో ఆహారం వచ్చిందని చెబుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం భవనం గుమాస్తా భవనంలో ఫ్యాన్‌లో ఏర్పాటు చేశాడని తమ వద్ద నిచ్చెన తీసుకు వెళ్లినట్లు స్థానికంగా ఉన్న కార్మికులు తెలిపారు. మరి భవనం గుమాస్తాను పోలీసులు విచారించారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.
మావోలు షెల్టర్ తీసుకున్న భవనం ఎదురుగా పని చేస్తున్న నాగార్జున అనే వ్యక్తి వివరాలు తెలుపుతూ నంబర్ లేని జీప్ రావటం కార్మికులందరం చాలా సార్లు చూశామన్నారు. ఆహారం ఇచ్చిన తరువాత సదరు వ్యక్తి కొద్ది సమయం ఇక్కడే ఉండేవాడని తెలిపారు. తమకు ఎలాంటి అనుమానం రాలేదని చెప్పారు. మావోలు పట్టబడ్డారంటే నమ్మలేక పోతున్నామని, ఇప్పుడు భయం వేస్తోందని చెబుతున్నారు. మావోలపై జాయింట్ ఆపరేషన్ జరిగిన సమయంలో భవనం ఎదురుగా పని చేస్తున్న కార్మికుల ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోలు ఉన్న భవనంలో కింద భాగంలో ఉన్న గోడౌన్ సిబ్బంది కూడా 28 మంది మావోలు భవనంలో ఉన్నట్లు గుర్తించలేక పోయారు.
పట్టుబడిన 28 మంది మావోయిస్టుల్లో 16 మందిని పెనమలూరు, 12 మందిని ఉయ్యూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు బుధవానం వేకువజామున పోలీసులు తీసుకు వచ్చారు. ఉయ్యూరు, పెనమలూరు పీహెచ్‌సీ వైద్యులు మావోయిస్టుల ఎత్తు, బరువు, బీపీ, సుగర్, హెచ్‌బీ వైద్య పరీక్షలు చేశారు. ప్రత్యేక బందోబస్తు వాహనాలలో విజయవాడ కోర్టుకు తరలించారు.
రాయన భాగ్యలక్ష్మి
సంపతి విజిత
7
రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరిపేందుకు క్షేత్ర స్థాయిలో యంత్రాంగం పని చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ బుధవారం దర్శించుకున్నారు.
విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం అవసరమని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. ఉంగుటూరు జెడ్పీ హై స్కూలులో మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


