హై అలర్ట్
ఆయుధాల డంపు బయటపడిందన్న వార్తలతో సర్వత్రా భయాందోళనలు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు గతంలోనూ మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా నగరం 1990–92లో ప్రజా కోర్టు నిర్వహించిన వైనం
న్యూస్‌రీల్
వరుసగా ప్రమాదాలకు కారణమవుతున్న ట్రావెల్స్ బస్సులు తాజాగా అనాసాగరం వద్ద లారీని ఢీకొట్టిన కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా జరిగిన ప్రమాదం నలుగురికి తీవ్రంగా, మరో ఎనిమిది మందికి స్వల్పంగా గాయాలు విజయవాడ – హైదరాబాద్ నేషనల్ హైవేపై నిత్యం ప్రమాదాలు
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
28 మంది మావోయిస్టుల పట్టివేతతో ఉలిక్కిపడిన బెజవాడ
పెనమలూరు: యనమలకుదురులో వేంచేసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి శాంతికల్యాణం నిర్వహించారు.
మోపిదేవిలో వేంచేసిన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మావోయిస్టులు పట్ట్టుబడటంతో విజయవాడ ఉలిక్కిపడింది. నాలుగు చోట్ల ఆయుధాల డంప్‌లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. నగర శివారులో ఉన్న కానూరు కొత్త ఆటోనగర్‌లో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, కృష్ణా జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం సోదాలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 28 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారంతా కొత్త ఆటోనగర్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని షెల్టర్‌గా చేసుకొని ఉండటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం విజయవాడ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచారు. మావోయిస్టులు ఉండే అవకాశమున్న అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. నగరంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా? ఆయుధాల డంపులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పట్టుబడిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేస్తున్నారు. వీఐపీల భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఈ మేరకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పట్టుబడిన మావోయిస్టులను టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఇంటెలిజెన్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. మావోయిస్టులు నగరానికి ఎలా వచ్చారు? వారు ఇక్కడ ఉండటానికి ఎవరు సాయం చేశా రనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. మావోయిస్టులు ఆశ్రయం పొందేందుకు విజయ వాడనే ఎందుకు ఎంచుకున్నారనే కోణంలో కూడా ఆరాతీస్తున్నారు. మావోయిస్టులు ఆయుధాలతో షెల్టర్ జోన్‌కు రారు. కేవలం ఆశ్రయం మాత్రమే పొందుతారు. అయితే ఆయుధాల డంపులు సైతం ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో ఎవరినైనా లక్ష్యంగా చేసేందుకు ఇక్కడ మకాం వేశారా అనే అనుమానం సైతం వ్యక్తం అవుతోంది.
గతంలోనూ షెల్టర్ జోనే..
40, 50 ఏళ్ల క్రితం బెజవాడ నక్సలైట్లకు షెల్టర్ జోన్‌గా ఉండేది. అప్పట్లో విజయవాడ శివారు ప్రాంతాలైన కృష్ణలంక, విద్యాధరపురం, క్రీస్తురాజపురం, మొగల్రాజపురం కొండ ప్రాంతాలు వారికి స్థావరాలుగా ఉండేవి. తొలుత విజయవాడలో 1990–92 ప్రాంతంలో కసూర్తిబాయి పేటలో ప్రజాకోర్టు నిర్వహించి ఒకరి కాళ్లు నరికేశారు. కృష్ణలంకలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇద్దరిని హత మార్చి వారి శవాలను బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో పడేశారు. నక్సలైట్ అగ్రనేత కొండపల్లి సీతారామయ్య ఇక్కడే షెల్టర్ తీసుకున్నారు. సున్నపు బట్టీల సెంటర్ అప్పట్లో నక్సలైట్లకు కీలక స్థావరంగా ఉండేది. వారు భూపోరాటాలు చేసినట్లు నగర వాసులు గుర్తుచేసుకుంటున్నారు. ఆడపిల్లతో అనుచితంగా వ్యవహరించిన వారి ఆట కట్టించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచే చాలా మంది నాయకులుగా ఎదిగి నక్సలైట్ల ఉద్యమంలో పాల్గొన్నారని పలువురు పేర్కొంటున్నారు. అనారోగ్యం, గాయపడిన వారికి విజయవాడ కేంద్రంగానే చికిత్సలు చేసేవారని అంటున్నారు. గతంలో ఇక్కడ పట్టుబడిన వారిని తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేసినట్లుగా చెబుతున్నారు. 30 ఏళ్లుగా విజయవాడలో పోలీసుల యాక్టివిటీ పెరగడం, వ్యాపారాల పరంగా వృద్ధి చెందటం, ఉపాధి అవకాశాలు పెరగడంతో క్రమేపీ మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. తాజాగా 28 మంది మావోయిస్టులు పట్టుబడటంతో నగరం ఉలిక్కి పడింది.
కానూరు ఆటోనగర్‌లో భవనంలో మావోయి స్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతోనే దాడులు చేసి 28 మంది మావోలను అదుపులోకి తీసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు విలేకరులకు తెలిపారు. వ్యూహం ప్రకారం దాడులు చేయటానికే మావోయిస్టులు వచ్చారని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టులు పలు నగరాలకు వచ్చారన్న సమాచారం ఉందని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారని వివరించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నామని తెలిపారు. కానూరు ప్రజలతో పాటు ఆటోనగర్‌లో పని చేస్తున్న కార్మికులు సైతం మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారని తెలిసి కంగారుపడ్డారు.
మావోయిస్టుల పట్టివేత అనంతరం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడులో నలుగురు, మండల కేంద్రమైన గన్నవరం పరిసరాల్లో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. తమ సానుభూతిపరురాలైన ఓ మహిళ ద్వారా కానూరు న్యూ ఆటోనగర్‌లో మావోయిస్టులు భవనాన్ని అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది.
గో సంరక్షణలో
ప్రభుత్వం విఫలం
హై అలర్ట్
హై అలర్ట్
హై అలర్ట్
హై అలర్ట్
హై అలర్ట్
హై అలర్ట్


