నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి మంగళవారం పలువురు భక్తులు విరా ళాలు సమర్పించారు. బెజవాడ సత్యనారాయణపురానికి చెందిన కె.రవికుమార్ కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేసింది. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి చెందిన రాలీ గణపతిరావు, లీల దంపతులు శిరీష, విశాల్, ఆద్య, దినేష్, యశ్వంత్ పేరిట రూ.1,00,116 విరా ళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
మచిలీపట్నం అర్బన్: యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వ్యక్తులకు మాత్రమే కాకుండా సమాజానికే పెద్ద ఆరోగ్య సవాలుగా మారిందని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏఎంఆర్ వారోత్సవాల పోస్టర్లు, బ్యానర్లను మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అనవసరంగా మందులు వాడటం ఏఎంఆర్‌కు ప్రధాన కారణమని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు మాత్రమే మందులు తీసుకోవాలని, హైజీన్, పరిశుభ్రత చర్యలను పాటించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి.యుగంధర్ మాట్లాడుతూ.. ఏఎంఆర్ కారణంగా ఇన్ఫెక్షన్ల చికిత్స కష్టతరం అవడంతో పాటు మరణాల రిస్క్ పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ ఈ నెల 24 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఏటీఓ డాక్టర్ అంబటి వెంకట్రావు, డాక్టర్ గోపాలకష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల తయారీదారులకు నూతన సాంకేతికతపై హస్తకళల ఎగుమతి, ప్రోత్సాహక సంస్థ (ఈపీసీహెచ్), అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ ఆధ్వ ర్యంలో శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. డిజైన్, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌పై రెండు నెలలు శిక్షణ ఇస్తారు. వివిధ నూతన అంశాలతో కూడిన మెలకువలపై శిక్షణ ఇస్తారని ఈపీసీహెచ్ ఇండియా – దక్షి ణాది రాష్ట్రాల సంచాలకుడు కలవకొలను నాగ తులసీరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొమ్మల తయారీలో నైపుణ్యం పెంచుకుని అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఎగుమతులు జరిగేలా తీర్చిదిద్దాలన్నారు. జౌళి మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అపర్ణ లక్ష్మి మాట్లాడుతూ.. వివిధ రకాల బొమ్మల తయారీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ చినిమిల్లి దివాకర్, యేసు, డిజైనర్ ప్రాసంజిత్ మహంతి, పలువురు కళాకారులకు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతిభావంతులైన విద్యార్థుల్లోని ఆలోచనాత్మక సామర్థ్యాలను వెలికితీయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న క్రీడాపోటీల వాల్‌పోస్టర్లను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. స్టెమ్ క్రీడా పోటీలు – 2026లను వీర్నాల బాలాజీ నేతృత్వంలో జనవరి 8, 9 తేదీల్లో సంక్రాంతి పండుగను పురస్కరించు కుని నిర్వహిస్తామని కలెక్టర్‌ఈ సందర్భంగా తెలిపారు. చెస్, క్విజ్, డిబేట్, మ్యాథ్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ వంటి విభాగాల్లో ఈ పోటీల్లో నిర్వహిస్తామన్నారు.
నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు


