ప్రభుత్వమే ఆదుకోవాలి
ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.60 వేలు చెల్లించి రెండెకరాలు కౌలుకు తీసుకుని టమాటా సాగు చేపట్టా. రెండెకరాలకు సుమారు రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కలు సుమారు 4 అడుగుల మేర ఎత్తు పెరగడంతో ఎదురు కర్రలతో పందిరి ఏర్పాటు చేసి తీగలకు పాకించా. పంట ఏపుగా పెరిగి, తొలి కాపు కోసే సమయానికి ఓ వైపు వరదలు, మరోవైపు తుపానుతో పూత పిందె రాలిపోయింది. పొలంలో వర్షం నీరు నిలవడంతో మొక్కలు వడబడిపోయాయి. చేను బతికేలా కనిపించడం లేదు. నష్టపోయిన పొలాలు పరిశీలించి పరిహారం చెల్లిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నా.
– పెయ్యల నాగేశ్వరరావు, రైతు, కొటికలపూడి


