పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి
నా సొంత పొలంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని 10 ఎకరాలు పత్తి, 9 ఎకరాలు మిర్చి, 15 మొక్కజొన్న, వరి 8 ఎకరాలు చేశా. పత్తి ఎకరానికి రూ. 35 వేలు, మొక్కజొన్న ఎకరానికి రూ.30వేలు, మిర్చి ఎకరానికి ఇప్పటికి 65వేల, వరి సాగుకు ఎకరానికి రూ.25వేలు అయ్యింది. తుపాను దెబ్బతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. చేసిన అప్పులు ఏ విధంగా తీర్చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కొండపల్లి శ్రీకాంత్ రైతు,
గొట్టుముక్కల, కంచికచర్ల మండలం


