తాలుతో పెట్టుబడులు నీటిపాలు..
మంతెన పరిసరాల్లో పైర్లు ఇంకో 20 రోజుల్లో చేతికి అందుతాయి. మొన్న తుపానుతో పైర్లు నేలమట్టం అయ్యాయి. కంకులు ఇప్పడే సుంకు పోసుకుంటున్నాయి. వర్షం దెబ్బకు తాలు తప్ప ఏర్పడ్డాయి. మడమతాలు వచ్చేసింది. ఇక గింజ కూడా గట్టిపడే పరిస్థితి లేదు. ఎకరాకు పెట్టిన రూ. 30 వేలు పెట్టుబడి నీటిపాలైనట్టే. రైతుల గోడు పట్టించుకునే నాథులు లేరు.
– కొండవీటి వెంకట సుబ్బారావు,
రైతు, మంతెన, కంకిపాడు మండలం కృష్ణాజిల్లా


