దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు శనివారం విరాళాలను అందజేశారు. విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన బండి మౌనిక కుటుంబం రూ.1.03 లక్షలు, అజిత్ సింగ్‌నగర్‌కు చెందిన కె. రామారావు దంపతులు రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో నగదు ప్రోత్సాహక పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, క్రీడల అభివృద్ధి అధికారి కె. కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడా పతక విజేతల నుంచి శాప్ (ఎస్‌ఏఏపీ) క్రీడా యాప్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని అర్హత కలిగిన క్రీడాకారులు ఈనెల 4వ తేదీ రాత్రి 11.59 గంటల లోగా స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించాలని ఆయన వివరించారు.
గుడివాడ టౌన్: ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. శనివారం విజేతలకు బహుమతులు అందజేశారు. మొత్తం 120మంది క్రీడాకారులు పాల్గొనగా 19 కేటగిరీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. పురుషుల విభాగంలో సీహెచ్ లితీష్ అనిల్ సాయి స్టాంగ్‌మ్యాన్‌గా.. ఎన్. వీర నాగు అను స్ట్రాంగ్ ఉమెన్‌గా ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి రంగప్రసాద్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. వెంకట్రావు, కార్యదర్శి వి. మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు


