సంబరం.. | - | Sakshi
Sakshi News home page

సంబరం..

Jul 11 2025 5:37 AM | Updated on Jul 11 2025 5:37 AM

సంబరం

సంబరం..

విజయవాడ సిటీ
ఎన్టీఆర్‌ జిల్లా
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
నయన మనోహరంగా దుర్గమ్మకు శాకంబరి అలంకారం
‘విజిబులిటీ ఎసెట్స్‌’కు శ్రీకారం

–8లోu

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కున్నాయి. శాకంబరి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా కొనసాగాయి. పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శాకంబరీదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా కనక దుర్గమ్మను నయన మనోహరంగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు.

ఉత్సవాలు పరిసమాప్తం

శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో గురువారం ఉదయం ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈఓ శీనానాయక్‌ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈఓ అన్నదానం పథకానికి రూ.50 వేల విరాళం సమర్పించారు. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల పండ్లు, ఫలాలు, డ్రై ప్రూట్స్‌తో అలంకరించారు. ఆలయాన్ని బత్తాయి. దానిమ్మ, ఫైనాపిల్‌, పచ్చి ఆల్‌బకరా, ఖర్జూరం, యాపిల్‌, పుచ్చకాయలు, పలు రకాల ద్రాక్షలతో అలంకరించారు. మూడు రోజుల ఉత్సవాల్లో 36 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

అమ్మ సన్నిధిలో గురుపూజా మహోత్సవం

వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో గురు పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానానికి చెందిన ఘనాపాటి తంగిరాల వెంకటేశ్వర ఘనాపాటి, వేద పండితుడు అహితాగ్ని గుంటూరు రామచంద్ర సోమయాజులు, సీనియర్‌ ముఖ్య అర్చకుడు శంకరమంచి శివప్రసాద్‌, దంపతులను సత్క రించి పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదాలు, నగదు బహుమతులు అందజేశారు.

కేసరపల్లి(గన్నవరం): గ్రామ పంచాయతీల ఆదాయం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ‘విజిబులిటీ ఎసెట్స్‌’ కార్యక్రమానికి గన్నవరం మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురంలో గురువారం శ్రీకారం చుట్టారు. హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌ సమీపంలో పంచాయతీ నిధులు రూ.6.54 లక్షలతో చేపట్టిన కుంభకోణం డిగ్రీ కాఫీ షాపు నిర్మాణాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి వివేక్‌ భరద్వాజ్‌, అదనపు కార్యదర్శి అలోక్‌ ప్రేమ్‌నగర్‌, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ ఎం.కృష్ణతేజ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం శిలాఫలకాన్ని భరద్వాజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను పెంచుకునేందుకు వీలుగా విజిబులిటీ ఎసెట్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలకు చెందిన ఖాళీ స్థలాల్లో స్పోర్ట్స్‌ క్లబ్‌లు, క్రికెట్‌ ప్రాక్టిస్‌ నెట్‌లు, ఈత కొలనులు, కాఫీ, టీ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వాటి నిర్వహణ, సంరక్షణ బాధ్యతలను గ్రామ పంచాయతీలు చేపట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభివృద్ధి వినియోగిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో తొలిసారిగా కేసరపల్లిలో కాఫీ షాపు ఏర్పాటు చేయనుండటం హర్షణీయమన్నారు. గ్రామ సర్పంచ్‌ చేబ్రోలు లక్ష్మీమౌనిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జె. అరుణ, డీఎల్‌పీఓ జి.సంపత్‌కుమారి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పొట్లూరి బసవరావు, ఉప సర్పంచి జాస్తి శ్రీధర్‌బాబు, ఎంపీటీసీ సభ్యుడు శొంటి కిషోర్‌, కేసర పల్లి ఈఓ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయవాడ పుచ్చలపల్లి సుందరయ్య మునిసిపల్‌ హైస్కూల్లో ఎమ్మెల్యే బొండా ఉమాను నిలదీస్తున్న మహిళలు

7

న్యూస్‌రీల్‌

మూడు రోజులు కనులపండువగా కొనసాగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో ఉత్సవాల ముగింపు పౌర్ణమి నేపథ్యంలో భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసిన ఆలయ పరిసరాలు

సంబరం.. 1
1/8

సంబరం..

సంబరం.. 2
2/8

సంబరం..

సంబరం.. 3
3/8

సంబరం..

సంబరం.. 4
4/8

సంబరం..

సంబరం.. 5
5/8

సంబరం..

సంబరం.. 6
6/8

సంబరం..

సంబరం.. 7
7/8

సంబరం..

సంబరం.. 8
8/8

సంబరం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement