ప్రజలు.. దేవుడు జగనన్నకు అండగా నిలిచారు | Sakshi
Sakshi News home page

ప్రజలు.. దేవుడు జగనన్నకు అండగా నిలిచారు

Published Tue, Apr 16 2024 2:25 AM

-

ఉప్పాల రాము, హారిక దంపతులు

పెడన: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు, దేవుడు అండగా నిలిచారని వైఎస్సార్‌ సీపీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రమేష్‌ (రాము), జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అన్నారు. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన బస వద్ద సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాము, హారిక మాట్లాడుతూ జగనన్న భయపడే వ్యక్తి కాదని తెలిపారు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక నీచ సంస్కృతికి ప్రతిపక్షాలు పాల్పడ్డాయని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరగా కోలుకుని ప్రజల ముందుకు క్షేమంగా తిరిగి వచ్చారని తెలిపారు. మరింత జనరంజక పాలన అందించడానికి వస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం ఖాయమన్నారు.

Advertisement
 
Advertisement