పకడ్బందీగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Published Thu, Nov 16 2023 1:48 AM

-

కృష్ణా జిల్లా కలెక్టర్‌

రాజాబాబు

చిలకలపూడి(మచిలీపట్నం): కులగణనపై ఈ నెల 16వ తేదీ గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణా కలెక్టర్‌ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్‌లో బుధవారం రాత్రి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహణపై స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సమావేశంలో పార్లమెంట్‌ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జెడ్పీ చైర్మన్‌, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. కులగణనకు సంబంధించిన సమాచారం ముందుగా అందజేసి సూచనలు, సలహాలు తెలియజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొనేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో సభ్యులు తెలియజేసే అభిప్రాయాలు, సలహాలు, సూచనలు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సీపీవోకు సూచించారు. జేసీ అపరాజితాసింగ్‌, డీఆర్వో పెద్ది రోజా, ఆర్డీవోలు ఎం. వాణి, దాసి రాజు, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షేక్‌ షాహిద్‌బాబు, జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం. ఫణిదూర్జటి, డీఎల్‌డీవో కేవీ సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement