ఆ 8 రకాలకే బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆ 8 రకాలకే బోనస్‌

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

మోర్తాడ్‌ (బాల్కొండ): వానకాలంలో సాగు చేసే స న్న రకాల వరిలో తాము సూచించే ఎనిమిది రకా లనే సాగు చేయండి.. బోనస్‌ పొందండి అంటూ వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం చేపట్టింది. సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా కేవలం 8 రకాలనే ప్రమోషన్‌ చేస్తూ ప్రచారం చేస్తుండటంతో రై తుల్లో గందరగోళం నెలకొంది. సన్న రకాలను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్‌గా చెల్లిస్తున్న విషయం విదితమే. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వాన కాలం సీజన్‌లో కొనుగోలు చేసిన సన్న రకాల కు బోనస్‌ను అందించారు. మొదట్లో సన్నాల్లో ఏ రకం సాగు చేసి విక్ర యించినా తేడా చూపకుండానే ప్రభుత్వం బోనస్‌ ను అందించింది. 2026 వా నకాలం సీజన్‌కు సంబంధించి మాత్రం 8 రకాలనే ప్రమోషన్‌ చేయాలని నిర్ణయించడం రైతులను అయోమయానికి గురి చే స్తోంది. ఒక వేళ ప్రభుత్వం సూచించిన 8 రకాలనే సాగు చేయాలంటే వి త్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయా అనే సంశయం నెలకొంది. సన్నాలలో ఎన్నో రకాలు ఉండగా రోగాల బారిన పడని, తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చేవి, కలుపు ఇబ్బందులు లేని రకాలను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సూ చించిన రకాలలో కొన్నింటికి దిగుబడి ఆశించినంతగా రాదని రైతులు చెబుతున్నారు. అలాగే రోగాల బారిన పడే రకాలు ఉన్నాయని తెలిపారు. ప్రమోష న్‌ చేయాలని సూచించిన 8 రకాల కంటే ఎంతో నాణ్యమైన విత్తనాలు మార్కెట్‌లో ఉన్నాయని రైతు లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సన్న రకాలకు బోనస్‌ అనే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని అంతేకాని తాము సూచించిన 8 రకాలకే బోనస్‌ వర్తిస్తుందనే ప్రకటనను ఉపసంహరించుకోవాలని రైతులు సూచిస్తున్నారు. వానకాలం సాగు కు అవసరమైన వరి విత్తనం సేకరణలో బిజీగా ఉన్న రైతులకు వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రచారం అయోమయంలోకి నెట్టిందని దీనిపై ప్రభుత్వం పునపరిశీలన చేయాలని పలువురు కోరుతున్నారు.

వరి వంగడాల పేర్లు సూచిస్తూ

వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం

వానకాలం 2026 సాగు ప్రమోషన్‌ పేరిట కరపత్రాల ముద్రణ

కొన్ని రకాలనే సూచించడంతో

రైతన్న అయోమయం

Advertisement
 
Advertisement
Advertisement