బోధన్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారోత్సవాలు’ సోమ వారం ప్రారంభమయ్యాయి. ఎడపల్లిలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ఆ ర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఇచ్చిన వాగ్ధానాల మేరకు రాష్ట్ర ప్రభు త్వం రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటల సాగు విధానాలను అవలంబించాలని, నేల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇ వ్వాలని సూచించారు. రైతు సంక్షేమానికి ప్ర భుత్వం కట్టుబడి ఉందన్నారు. సాలూర మండలంలోని హున్సాలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారిణి శ్వేత మాట్లాడారు. నేల ఆరోగ్య రక్షణ, సమగ్ర ఎరువుల యాజమాన్యం పద్ధతు లను వివరిస్తూ నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతామని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. సాలూర మండల కేంద్రంలో, జాడిజమాల్‌పూర్ రైతు వేదిక భవనంలో రైతు వారోత్సవాలను నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఏఈవోలు, నాయకులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
వ్యవసాయ కమిషన్ సభ్యుడు
గడుగు గంగాధర్
జిల్లాలో రైతు వారోత్సవాలు
ప్రారంభం


