సాగు ఖర్చులను తగ్గించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సాగు ఖర్చులను తగ్గించుకోవాలి

May 2 2026 12:07 PM | Updated on May 2 2026 12:07 PM

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఉత్తునూర్‌ రైతు వేదిక కార్యాలయంలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు–అన్నదాతలు అనే కార్యక్రమంపై అవగాహన సద్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిరిసిల్లా వ్యవసాయ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అశ్విని పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పంటలు సాగు చేసే టప్పుడు యూరియా వాడకాన్ని పూర్తిగా తగ్గించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవసరం ఉన్న మేరకే రసాయనాలను వినియోగించి ప్రకృతిని రక్షించుకోవాలన్నా రు. ప్రతిరైతు పంటమార్పిడి చేయాలన్నారు. మా ర్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలను ఎంచుకొని సాగు వేసుకోవాలని సూచించారు. ఏవో ప్రజాపతి, ఏఈ వోలు ప్రణతి, కవిత, శ్రీనివాస్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement