నిజామాబాద్ రూరల్: మండలంలోని మల్కాపూర్ (ఏ) గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రూ. 200 కోట్లతో నిర్మించనున్న పాఠశాలకు సంబంధించిన ప్రణాళికను శుక్రవారం సంబంధిత ఈడబ్ల్యూడీసీ అధికారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసి వివరించారు. పాఠశాల నిర్మాణానికి సంబంధించిన ప్లాన్, మ్యాపు తదితర వాటిపై అధికారులు చర్చించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఈఈఐడీసీ రవీందర్, డీఈలు రాందాస్,రవి, ఏఈ తుకారాం ఉన్నారు.
● త్వరలో నిర్మాణానికి భూమి పూజ
● ఎమ్మెల్యే భూపతిరెడ్డిని
కలిసిన అధికారులు


