● ఎల్లారెడ్డిపల్లె మాజీ సర్పంచ్
ఆత్మహత్యాయత్నం
ఇందల్వాయి: యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఎల్లారెడ్డిపల్లె గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కోత లు పూర్తయి నెలరోజులు గడుస్తున్నా ధాన్యం కొను గోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధా న్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఎల్లారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ మఠంల శేఖర్ ఒంటిపై పెట్రోల్ పో సుకొని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 200 మంది రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. రైతులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు తీర్చాలని పట్టుబట్టారు. తహసీల్దార్ బాలయ్య రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.


