తండ్రి, తల్లి, కొడుకు సర్పంచ్‌లు
రుద్రూర్: గ్రామానికి ఒక్కసారి సర్పంచ్‌గా ఎన్నికై తేనే ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటిది పోతంగల్ మండలం హంగర్గా గ్రామ సర్పంచ్‌లుగా ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కొడుకు పనిచేశారు. హంగర్గా సర్పంచ్‌గా నీరడి గంగాధర్ 1995లో ఎన్నికయ్యారు. గ్రామానికి అందించిన సేవలను గుర్తించిన గ్రామస్తులు 2001లో ఆయన భార్య నీరడి సావిత్రిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2013లో సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించడంతో గంగాధర్ కుమారుడు ఉదయ్ భాస్కర్ సర్పంచ్‌గా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉదయ భాస్కర్ మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.


