బరిలో మేనమామ, అల్లుడు
బోధన్: సాలూర మండలంలోని కుమ్మన్‌పల్లి సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఈ గ్రామంలో 628 మంది పురుషులు, 699 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రామ సర్పంచ్ స్థానానికి బుడిమె శ్రీనివాస్ రెడ్డి, శీలం మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి సొంత అక్క కుమారుడు మహేందర్ రెడ్డికి మేనమామ. మహేందర్ రెడ్డి తొలిసారిగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. శ్రీనివాస్ రెడ్డి సతీమణి హైమవతి గతంలో సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలో మేనమామ, అల్లుడు ప్రత్యర్థులుగా నిలిచారు. ఇరువురి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
బరిలో మేనమామ, అల్లుడు


