37 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
● నిజామాబాద్‌రూరల్‌లో..
డిచ్‌పల్లి/ధర్పల్లి/ఇందల్వాయి/సిరికొండ/మోపాల్ /మాక్లూర్ : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. పలు గ్రామాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఒక్కో నామినేషన్ చొప్పున మిగిలిన పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 170 గ్రామ పంచాయతీలుండగా 30 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలో మొత్తం 26 జీపీలకు ఏడుగురు సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. నామినేషన్ వేసిన అభ్యర్థులు ఎన్నికల అధికారుల ఎదుట స్వచ్ఛందంగా విత్ డ్రా అయినట్లు సంబంధిత పత్రాలను అందజేశారు.
37 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
37 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
37 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
37 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం


