
ఏజెంట్ల మోసంపై విచారణ
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏజెంట్ల మోసానికి గురికాగా, ఈ ఘటనపై భా రత విదేశాంగ శాఖ విచారణ ప్రారంభించింది. వివరాలు ఇలా.. వేల్పూర్ మండలం పడి గెల వాసి గంగాప్రసాద్ యూర ప్ వెళ్లే ప్రయత్నంలో ఏజెంట్ల మోసానికి గురై దుబాయ్‌లో మూడేళ్ల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండిపోయాడు. ఏజెంట్లు బాధితుడి నుంచి రూ.8.77 లక్షలు వసూలు చేసి టోకరా వేసిన విషయం విధితమే. ఈ విషయంపై బాధితుడి తండ్రి భోజన్న ఇటీవల ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. మరోవైపు గంగాప్రసాద్ సామాజిక మాధ్యమం ద్వారా ఎంపీ అర్వింద్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. దీంతో రెండ్రోజుల క్రితం దుబాయ్‌లో ఉన్న గంగాప్రసాద్‌ను విదేశాంగశాఖ అధికారులు ఎంబసీకి పిలిపించుకున్నారు. వారు ఏజెంట్ల పేర్లు, వారి వివరాలను నమోదు చేసుకున్నట్లు బాధితుడు ‘సాక్షి’కి ఫోన్‌లో తెలిపారు. తన వీసా గడువు ముగిసిపోగా ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ప్రవాసీ ప్రజావాణి లేఖ మేరకు విచారణ చేపట్టాలని వేల్పూర్ ఎస్సై సంజీవ్‌ను సీపీ సాయి చైతన్య ఆదేశించారు. దీంతో సదరు ఏజెంట్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
● దుబాయ్‌లో చిక్కుకున్న జిల్లావాసితో మాట్లాడిన ఎంబసీ అధికారులు
● వేల్పూర్‌లోనూ పోలీసుల ఆరా