
ఎస్సారెస్పీలోకి గుర్రపు డెక్క
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు గుర్రపు డెక్క కొట్టుకువస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిలో గుర్రపు డెక్క మొక్కలు భారీగా పేరుకుపోగా, కొన్ని ఆనకట్ట అంచున వచ్చిచేరాయి. గుర్రపు డెక్క పేరుకుపోతే ఆనకట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుర్రపు డెక్కతో అనర్థాలు..
గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క. ఇది వేగంగా పెరిగి నీటి వనరులను మూసుకు పోయే లా చేస్తుంది. దీని వలన నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుంది. ప్రాజెక్ట్ అనకట్ట అంచున గురప్రుడెక్క పేరుకుపోతే రివిట్‌మెంట్‌లోకి నీరు అధికంగా వెళ్లి అనకట్టకు గండి పడే ప్రమాదం ఏర్పడుతుంది. చేపల పెంపకాననికి అంటకంగా మారుతుంది. దీని వలన అధికంగా దోమలు, ఇతర కీటకాలు పెరిగి నీటి నాణ్యతను దెబ్బతీస్తుంది. గుర్రపు డెక్క నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుంది. ఒక్కసారి నాటుక పోతే తొలిగించడానికి చాలా ఖర్చు అవుతుంది. దీంతో ఆర్థికంగా కూడ తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆనకట్ట అంచున పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలిగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరదతోపాటు కొట్టుకువస్తున్న వైనం
పట్టించుకోని అధికారులు
ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం..
గుర్రపు డెక్క ప్రాజెక్ట్‌లోకి వరదల వలన కొట్టుకువస్తోంది. తొలిసారి రావడం ఆశ్చర్యంగా ఉంది. గుర్రపు డెక్క సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గుర్రపు డెక్క పెరగక ముందే తొలిగించుటకు ఉన్నత అధికారులతో చర్చలు జరుపుతున్నాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ

ఎస్సారెస్పీలోకి గుర్రపు డెక్క