
అన్నివర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
నిజామాబాద్ సిటీ: దేశ స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక ఘట్టమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హుందాన్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో క్విట్ ఇండియా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ భవన్‌లో తాహెర్‌బిన్ జాతీయ జెండాను, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి ఎగురవేశారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్‌లో కాంగ్రెస్ జెండాను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో తాహెర్‌బిన్ మాట్లాడుతూ.. మహత్మాగాంధీ శాంతియుతంగా చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిషర్లను దేశం వదిలేలా చేసిందన్నారు. అన్నివర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఈకార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్‌గౌడ్, నాయకులు నరాల రత్నాకర్, రామర్తి గోపి, నరేందర్‌గౌడ్, లవంగ ప్రమోద్‌కుమార్, మొయిన్, వంశీ, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.

అన్నివర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం