
ఏదైనా స్ట్రెయిట్‌గా..
నిజామాబాద్‌అర్బన్: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా హవానే జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సమాచార పంపిణీలో వాట్సాప్ అగ్రగామిగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. వాట్సాప్‌లోని స్టేటస్ ఫీచర్ ద్వారా ఒకరి అభిరుచులను, ఒకరి విషయాలను, ఒకరి చెడు, మంచి ఘటనలను తేలికగా తెలుసుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ స్టేటస్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
ప్రతిభను కనబర్చినా..
చాలామంది తమ వ్యక్తిగత ప్రతిభ చాటడానికి స్టేటస్‌ను ఉపయోగించుకుంటున్నారు. విద్యా, ఉద్యోగం, క్రీడలు ఇలా ఎందులోనైనా వారు ప్రతిభ సాధించి ఉంటే అప్పటికప్పుడు స్టేటస్‌లో పోస్ట్ చేస్తున్నారు. లేదా వారి కుటుంబ సభ్యులు ఎవరు ప్రతిభ కనబర్చినా పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టులు చూసినవారు వారిని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
మనోభావాలను వ్యక్తపరుస్తూ..
కొందరు వారి మనోభావాలను తెలియజేసే విషయాలను ఎంపిక చేసుకొని స్టేటస్‌లో పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది వారికి జరిగిన మంచి, చెడులను ఇతరులకు చెప్పేందుకు స్టేటస్‌ను ఆశ్రయిస్తున్నారు. అలాగే కొందరు ప్రతిరోజు ఉదయమే వారానికి తగ్గట్టు దేవుళ్ల ఫొటోలు, పాటలతో స్టేటస్ పెడుతుంటారు. ప్రత్యేక రోజులు, పండుగల్లోనూ శుభాకాంక్షలు తెలుపుతూ స్టేటస్ పెట్టేవారు కూడా చాలామంది ఉన్నారు.
చూసేవారు ఎక్కువే..
వాట్సాప్‌ను ఉపయోగించే వారందరూ స్టేటస్‌లో వారికి నచ్చిన అంశాలను పోస్ట్ చేయడంతోపాటు ఇతరుల స్టేటస్‌ను చూస్తూ ఉంటున్నారు. ఐదేళ్ల క్రి తం వరకు వాట్సాప్ యాప్ ఉపయోగించే వారిలో పది నుంచి 20 శాతం మాత్రమే స్టేటస్ ఫీచర్‌ను ఉ పయోగించేవారు. ఇప్పుడు 80 శాతం మంది వర కు ఈ ఫీచర్‌ను చూస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు రోజుల్లో నాలుగైదు సార్లు స్టేటస్‌ను చూడందే నిద్రపోవడం లేదు. వారు పెట్టిన పోస్టులను ఎంతమంది చూశారు? ఎవరైన ప్రతి స్పందించారా అన్న ఆత్రుత కోసం వెతికేవారు ఎంతోమంది ఉన్నారు. ఇలా వారు పెట్టిన పోస్ట్‌కు ఎవరు స్పందించకపోతే తీవ్ర అసంతృప్తి గురయ్యే వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా వాట్సాప్ స్టేటస్‌తో వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల తమ భద్రతకు, వ్యక్తిగ త గోప్యతకు భంగం కలుగుతుందన్న విషయాన్ని కూడా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తానేంటో తెలుపుతూ..
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో వాట్సాప్ యాప్‌లోని స్టేటస్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆధునిక టెక్నాలజీకి అలవాటు పడ్డ చాలా మంది స్టేటస్ పోస్ట్ పెట్టడం అనేది ఒక స్టేటస్‌గా భావిస్తున్నారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ తదితర మాధ్యమాలు ఉన్నప్పటికీ ఎక్కువగా వాట్సాప్ స్టేటస్ వేదికగా వాడుకుంటున్నారు. తానేంటో తెలిపేందుకు, ఇతరుల విషయాలు తెలుసుకునేందుకు స్టేటస్ ముఖ్య భూమిక పోషిస్తుంది. రోజువారి జీవితంలో చేసే పనులను, వెళ్లిన ప్రదేశాలను వాట్సాప్ స్టేటస్‌గా పెడుతూ ఎప్పటికప్పుడు తాము ఉన్న స్థితిని తెలియజేస్తున్నారు.
వ్యాపారానికి ప్రచారం..
వ్యాపార అభివృద్ధికి సోషల్ మీడియా ఒక ప్రచార వేదికగా మారింది. అందులోనూ అందరూ ఎక్కువగా చూసే వాట్సాప్ స్టేటస్‌ను చాలామంది వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు. వ్యాపారం గురించి బ్రోచర్లు ముద్రించి స్టేటస్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇక విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన వివరాలను ప్రతిరోజు స్టేటస్‌లో ప్రదర్శిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, హోట ల్స్, వివిధ దుకాణాలు, మాల్స్ ఇలా అన్ని వ్యాపార రంగాల వారు తమ ఆఫర్లను, సర్వీసులను స్టేటస్‌లో పెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

ఏదైనా స్ట్రెయిట్‌గా..

ఏదైనా స్ట్రెయిట్‌గా..

ఏదైనా స్ట్రెయిట్‌గా..

ఏదైనా స్ట్రెయిట్‌గా..