
మార్కెట్‌లో రాఖీల కొనుగోళ్ల సందడి
నిజామాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిజామాబాద్: నిజామాబాద్ నగర మార్కెట్లో రాఖీల కొనుగోళ్లతో సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి(రక్షాబంధన్) సందర్భంగా మహిళలు, యువతులు వివిధ రకాల రాఖీలు, స్వీట్లు కొనుగోలు చేయడానికి శుక్రవారం నగరానికి భారీగా తరలివచ్చారు.
గత వారం రోజులుగా రాఖీల విక్రయాలు కొనసాగుతుండగా, పండుగ సమీపించడంతో నగరంలోని ప్రధాన చౌరస్తాలు, దుకాణాల్లో రద్దీ నెలకొంది. కుమార్‌గల్లి, పెద్దబజార్, గాయత్రినగర్‌చౌరస్తా, వినాయక్‌నగర్, కంఠేశ్వర్‌లలో దుకాణాలు పెట్టి వ్యాపారాలు సాగే అన్నిచోట్లా సందడి నెలకొంది. మార్కెట్లో రకరకాల రాఖీలు అందుబాటులో ఉండగా, కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక..
అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. శ్రావణ పౌర్ణమి రోజున ఈ పర్వదినాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడెక్కడో ఉన్న సోదరసోదరీమణులు పండుగ పూట తప్పకుండ కలుసుకుంటుంటారు. సోదరులకు సోదరీమణులు రాఖీలు కట్టి, మురిసిపోతారు. సోదరులు వారికి తోచిన కట్నం అందించి, వారి ఆశీర్వాదం తీసుకుంటారు.
ఆనందంగా ఉంటుంది..
రాఖీ పౌర్ణమి రోజున తమ్ముడికి రాఖీ కడితే చాలా సంతోషంగా ఉంటుంది. ఏటా రాఖీ పౌర్ణమి నాడు తమ్ముడికి రాఖీకడుతాను. ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తాను. – నిక్షిత, ధర్మారం
పుట్టింటికి వెళ్లాల్సిందే..
అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే బంధం అనిర్వచనీయమైంది. మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి రాఖీ కడుతున్నాను. పండుగ రోజు ఖచ్చితంగా పుట్టింటికి వెళ్లి, తమ్ముడికి రాఖీ కట్టాల్సిందే. – లక్ష్మీ, బర్ధిపూర్

మార్కెట్‌లో రాఖీల కొనుగోళ్ల సందడి

మార్కెట్‌లో రాఖీల కొనుగోళ్ల సందడి

మార్కెట్‌లో రాఖీల కొనుగోళ్ల సందడి

మార్కెట్‌లో రాఖీల కొనుగోళ్ల సందడి