
తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివని, తల్లిపాలతో పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమాధికారిణి ఎస్‌కే రసూల్‌బీ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌జీ గార్డెన్స్‌లో గురువారం వారం రోజులుగా కొనసాగుతున్న తల్లి పాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. అప్పుడే పు ట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు సూ దం లక్ష్మి, ఇందల్వాయి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ క్రిస్టినా, పిల్లల డాక్టర్ దీపక్‌రాథోడ్ మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పలువురు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతి, హెచ్‌ఈవో శంకర్, ఆయుష్ డాక్టర్ మాధవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు బుజ్జి, మమత, శోభ, సరిత, వరలక్ష్మీ, సునీత, భాగ్యలక్ష్మి, రాధాలక్ష్మి, డిస్ట్రిక్ కోఆర్డినేటర్ రాంబాబు, ఐటీ ప్రకాశ్, బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమాధికారిణి రసూల్‌బీ
ముగిసిన తల్లి పాల వారోత్సవాలు