
వేల్పూర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
వేల్పూర్: మండల కేంద్రంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల, పీహెచ్‌సీ, సహకార సంఘం ఎరువుల గోడౌన్‌ను పరిశీలించారు. పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ విధానం ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. సాంకేతిక ఇబ్బంది కారణంగా కొంతమంది విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నమోదు కావడం లేద ని హెచ్‌ఎం రాజన్న తెలుపగా, కలెక్టర్ అప్పటికప్పు డు ఎఫ్‌ఆర్‌ఎస్ పద్ధతిన విద్యార్థుల హాజరును ఆన్‌లైన్‌లో నమోదు చేయించారు. అంతకుముందు వే ల్పూర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ వీణకు సూచించారు. కాగా, పీహెచ్‌సీల్లో బేబీ వా ర్మర్లు పని చేయడం లేదని తెలుసుకున్న కలెక్టర్ టీజీఎంఎస్ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కు ఫోన్ చేసి, వెంటనే అన్ని పీహెచ్‌సీల్లో బేబీ వార్మర్లకు మరమ్మతులు చేయించాలని, అవసరమైన చోట కొత్తవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో బాలకిషన్‌ను వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగ తి గురించి జీపీ కార్యదర్శి వినోద్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఉన్నారు.