
పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
డిచ్‌పల్లి: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. సోమవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఎస్‌పీఆర్ జూనియర్ కళాశాలలో నవీన్ అధ్యక్షతన నిర్వహించిన ఏఐఎస్‌ఎఫ్ నిజామాబాద్ రూరల్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలో ఉన్నత వి ద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థు లు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్ రూరల్ నియోజకవర్గ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, నాయకులు నవీన్, కృష్ణ, మహిపాల్, అబ్దుల్, కుమార్, విజయ్, శశికాంత్, చరణ్, విక్రమ్, నితిన్, శివ తదితరులు పాల్గొన్నారు.