
డిచ్‌పల్లి సీఎంసీ పాస్టరేట్ కమిటీ ఎన్నిక
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి సీఎంసీ పాస్టరేట్ కమిటీని సభ్యులు ఆదివారం రాత్రి ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆరుగురు పోటీ పడగా కమిటీ సభ్యులుగా మె ట్టు శ్యాంసన్ దైవాశీర్వాదం, ముల్కల డానియల్ సురానా, మద్దెల ప్రశాంత్‌రాజ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా సీఎంసీ మినిస్టీరియల్ సెక్రటరీ జయానంద్, ప్రెసిబిటర్ ఇన్‌చార్జి ఏసుకుమార్, సహాయకులుగా దినకర్, స్టీవెన్ కుమార్ వ్యవహారించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికా రి జయానంద్ మాట్లాడుతూ.. డిచ్‌పల్లి సీఎంసీ ఫాస్టరేట్ కమిటీ ఎన్నికల్లో ముగ్గురు సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు. సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ ద్వారా మరో ఇద్దరు సభ్యులను నామినేషన్ విధానంలో నియమిస్తారని వివరించారు. నూతనంగా ఎన్నికై న శ్యాంసన్, డేనియల్ సురానా, ప్రశాంత్‌రాజ్ లను సభ్యులు ఘనంగా సన్మానించారు.