
క్యాంపస్‌లో బాలికల హాస్టల్‌ను నిర్మించాలి
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో వెంటనే నూతన బాలికల హాస్టల్‌ను నిర్మించాలని వర్సిటీ ఏబీవీపీ అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వి, సమీర్ డిమాండ్ చేశారు. శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ పేరుతో ఏర్పడిన యూనివర్సిటీలో అడుగడుగునా సమస్యలు నెలకొన్నాయన్నారు. రూసా నిధులు మంజూరై, టెండరు ప్రక్రియ పూర్తయినప్పటికీ బాలికల హాస్టల్ నిర్మాణ పనులు ప్రారంభించక పోవడంలో వీసీ అలసత్వం, స్థానిక ఎమ్మెల్యే రాజకీయం కారణమని ఆరోపించారు. యూనివర్సిటీకి ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఇప్పుడు కొత్తగా కళాశాలలో చేరే విద్యార్థినులకు ఏ విధంగా వసతి కల్పిస్తారో వర్సిటీ ఉన్నతాధికారులు చెప్పాలని పేర్కొన్నారు. హాస్టల్ నిర్మాణ పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మోహన్, నాయకులు మనోజ్, అనిల్, అఖిల్, సంతోష్, సాయి, శ్రీనిత్య, వర్షిణి, నిఖిత తదితరులు పాల్గొన్నారు.