
అధ్వానంగా గ్రామీణ రహదారులు
జక్రాన్‌పల్లి: మండలంలోని జక్రాన్‌పల్లి నుంచి నల్లగుట్ట తండాకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జక్రాన్‌పల్లి నుంచి నల్లగుట్ట తండాకు వెళ్లే రోడ్డులోనే మోడల్ స్కూల్, కేజీబీవీలు ఉన్నాయి. రోడ్డు బాగా లేకపోవడంతో మోడల్, కేజీబీవీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోడల్ స్కూల్‌కు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఆటోలోనే ప్రయాణిస్తుంటారు. కానీ రోడ్డు గుంతలమయంగా మారడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, నల్లగుట్ట తండావాసులు, అటువైపు పంట పొలాలు ఉన్న రైతులు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. వాహనదారులు ఈ రోడ్డు వెంట ప్రయాణించాలంటేనే జంకుతున్నారు. ఈ రోడ్డులో ఎక్కువగా మూలమలుపులు ఉండడంతో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గుంతలమయంగా మారిన
జక్రాన్‌పల్లి–నల్లగుట్ట తండా రోడ్డు
ఇబ్బందిపడుతున్న వాహనదారులు

అధ్వానంగా గ్రామీణ రహదారులు