స్థానికమే పరమార్థం | - | Sakshi
Sakshi News home page

స్థానికమే పరమార్థం

Jul 19 2025 1:07 PM | Updated on Jul 19 2025 1:07 PM

స్థాన

స్థానికమే పరమార్థం

శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025

– 8లో u

రంగం సిద్ధం

చేసుకుంటున్న బీజేపీ

జిల్లాలో ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ సైతం స్థానిక ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు ఎంపీ అర్వింద్‌ ఆధ్వర్యంలో రంగం సిద్ధం చేసుకుంటోంది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు అర్వింద్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో బలంగా ఉన్న బీజేపీ, అధికార కాంగ్రెస్‌ను బలంగా ఢీకొట్టేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో ఇక్కడ సైతం రెండు జాతీయ పార్టీల మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నెలకొనే పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్‌ 30లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళుతోంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ న్యాయ సలహాకు పంపేందుకు నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పొలిటికల్‌ హీట్‌తో కూడిన సందడి నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠగా ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. స్థానిక ఎన్నికల వేడి మెల్లిగా మొదలై ఎన్నికల కోడ్‌ వచ్చే సమయానికి తారాస్థాయికి చేరుకుంటుందని అంతా అనుకుంటున్న నేపథ్యంలో పరిస్థితి మరోలా తయారవుతోంది. ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం రాజకీయంగా గరంగరం వాతావరణం నెలకొంది. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌, వేల్పూర్‌ మండలాల్లో వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు ఘర్షణ వాతావరణానికి బీజాలు వేశాయి. భీమ్‌గల్‌లో మంత్రి జూపల్లి పర్యటన నేపథ్యంలో నెలకొన్న ఘర్షణ, తాజాగా డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం వల్ల వేల్పూర్‌లో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ యాక్టు అమలు చేసే వరకు వెళ్లింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా నిర్బంధించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన పలువురిని అరెస్టు చేశారు. ఈ రగడ ఇప్పటికీ చల్లారడం లేదు. గల్ఫ్‌ కార్మికుల అంశం కాస్తా అన్ని విషయాలపై ఇరుపార్టీలు పోటాపోటీగా ఎంచుకునే వరకు వచ్చింది.

● వేల్పూర్‌ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పందించారు. అధికారం ఉంది కదా అని దాడులకు రావడం సరికాదన్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొంటామని బాజిరెడ్డి స్పష్టం చేశారు. గల్ఫ్‌ కార్మికులకు ఏమీ చేయలేదని, అడిగితే దాడులకు దిగడమేమిటన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించారు. దాడుల సంస్కృతి సరికాదన్నారు.

● డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి శుక్రవారం మరో ప్రకటన చేశారు. దీంతో మరింత కాక రేగుతోంది. గల్ఫ్‌ కార్మికుల విషయంలో ప్రశాంత్‌రెడ్డి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా గల్ఫ్‌ కార్మిక కుటుంబాలకు పరిహారం ఇచ్చిన విషయాన్ని రుజువు చేసే ప్రయత్నం చేశామన్నారు. ప్రతిపక్షం విమర్శలు చేయొచ్చు కానీ గూండాలను దాడికి సిద్ధంగా ఇంట్లో ఉంచడమేమిటన్నారు. ప్రశాంత్‌రెడ్డి కంటే తనకు ఎక్కువ రాజకీయ అనుభవముందని మానాల అన్నారు. ప్రశాంత్‌రెడ్డి తమ్ముడు ఏం చేస్తున్నాడో, గతంలో మానాలలో ప్రశాంత్‌రెడ్డి అక్రమ కేసులు పెట్టించిన విషయాలు అందరికీ తెలుసన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడితే నంగి దేవేందర్‌రెడ్డిపై దాడి చేసేవాళ్లా అన్నారు. ప్రతిపక్షాల స్వేచ్ఛను హరిస్తే తాను గృహనిర్బంధంలో ఉంటానా అని మానాల ప్రశ్నించారు.

● ఇదిలా ఉండగా కమ్మర్‌పల్లిలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రశాంత్‌రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జిల్లావ్యాప్తంగా ఇరు పార్టీల నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.

న్యూస్‌రీల్‌

ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

పొలిటికల్‌ హీట్‌

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో

పల్లెల్లో సందడి

బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై ఉత్కంఠ

కాక పుట్టిస్తున్న నేతల మాటలు

బాల్కొండ నియోజకవర్గంలో

ఉద్రిక్త వాతావరణం

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల ప్రకటనలతో ఇతర ప్రాంతాల్లోనూ వేడి

జిల్లాలో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది అక్కడితో ఆగకుండా ఘర్షణ వాతావరణానికి దారి తీసింది.

గల్ఫ్‌ కార్మికుల అంశంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య రగడ జరుగుతోంది.

నిజామాబాద్‌అర్బన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ పథకాల అమలుపై ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని నిజామాబాద్‌ రూరల్‌ మాజీ ఎమ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. నగరంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నారై సెల్‌పై ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి నిలదీశారన్నారు. ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకే వేల్పూర్‌ ఘటన చోటుచేసుకుందన్నారు. ఎమ్మెల్యే ఇంట్లోకి కాంగ్రెస్‌ నాయకుడు అక్రమంగా ప్రవేశించడమే కాకుండా వీడియోలు తీయడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్‌ నా యకుడిని వదిలేసి తమ కార్యకర్తలపై కేసులు వేయడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్‌ నాయకు ల ఒత్తిళ్లతో పోలీసులు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు దేశ, రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా నాయకుల అభివృద్ధికి పాటుపడుతున్నాయని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు కలిసి అవినీతికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ విఠల్‌రావు, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, నుడా మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్థానికమే పరమార్థం1
1/3

స్థానికమే పరమార్థం

స్థానికమే పరమార్థం2
2/3

స్థానికమే పరమార్థం

స్థానికమే పరమార్థం3
3/3

స్థానికమే పరమార్థం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement