వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

Jul 19 2025 1:07 PM | Updated on Jul 19 2025 1:07 PM

వన్య

వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

రామారెడ్డి: మండలంలోని స్కూల్‌తండాతోపాటు ఇందల్వాయి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఏలుసింగ్‌ మేరు స్పష్టం చేశారు. పులి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నా జాడ కనిపించలేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్కూల్‌ తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆవుపై పెద్దపులి దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అటవీ ప్రాంత సమీపంలో ని గ్రామాల్లో చాటింపు వేయించి పెద్దపులి సంచరిస్తున్న విషయాన్ని తెలియజేశామన్నా రు. వారం రోజులుగా అటవీ సిబ్బంది పె ట్రోలింగ్‌ చేస్తున్నారన్నారు. అటవీ జంతువులకు హాని కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చ ర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో నిఖిత హెచ్చరించారు. పులిపై విషప్రయోగం జరి పిన ఘటనలో ఇప్పటికే నలుగురిపై కేసు న మోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయా న్ని తెలిపారు. క్రూరమృగాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచా రం అందిస్తే తొందరగా వాటిని పట్టుకునేందుకు వీలవుతుందన్నారు. వారం రోజులు గా వెతుకుతున్నా పులి కనిపించడం లేదంటే అది వెళ్లిపోయినట్లు కాదన్నారు. ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్య క్రమంలో అసిస్టెంట్‌ ఎస్పీ చైతన్యరెడ్డి, అట వీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెన్షన్ల హామీ మరిచిన కాంగ్రెస్‌ సర్కారు

మందకృష్ణ మాదిగ

నిజామాబాద్‌అర్బన్‌: అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎ న్నికల్లో ఇచ్చిన ఆసరా పెన్షన్ల హామీని విస్మరించిందని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నగరంలోని లక్ష్మి కల్యాణ మండపంలో శుక్రవారం పెన్షన్‌దారుల దివ్యాంగుల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా ఆసరా పెన్షన్‌ రూ.2వేల నుంచి రూ. 4వేలకు, దివ్యాంగులకు రూ.6వేల చేయూ త పెన్షన్‌ ఇస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మరిచిపోయారని విమర్శించారు. సమావేశంలో దివ్యాంగుల హక్కుల సమితి నాయకులు బీరప్ప, సుజాత సూర్యవంశీ, మాదిగ రిజర్వేషన్‌ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి, కనక ప్రమోదు, మైలారం బాలు పాల్గొన్నారు.

జూనియర్‌ అసిస్టెంట్లకు ముగిసిన శిక్షణ

నిజామాద్‌ రూరల్‌: కారుణ్య నియామకాల్లో భాగంగా కొత్తగా వచ్చిన జూనియర్‌ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. పది రోజులపాటు వివిధ అంశాలపై అధికారులు శిక్షణ ఇచ్చా రు. జిల్లా పరిషత్‌ డీపీఆర్‌సీ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో జెడ్పీ ఇన్‌చార్జి సీఈవో సాయన్న మాట్లాడారు. ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం ఎస్టాబ్లిష్‌మెంట్‌, అకౌంట్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీనివాసరావు, సునీత దేవి, భరత్‌, లింగన్న, శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ జిల్లా మినిస్టేరియల్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు గడ్డం భాస్కర్‌, సెక్రెటరీ ప్రదీప్‌కుమార్‌, ట్రెజరర్‌ విఠల్‌ పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సుభాష్‌నగర్‌: నగరంలోని పలు సబ్‌స్టేషన్ల పరిధిలో 3వ శనివారం నిర్వహణ కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరా యం ఏర్పడుతుందని టౌన్‌ –1, 2 ఏడీఈ లు ఆర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌ ప్రసాద్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముబారక్‌నగర్‌, తిలక్‌గార్డెన్‌, పవర్‌ హౌస్‌, మిర్చి కాంపౌండ్‌, అర్సపల్లి సబ్‌స్టేషన్ల పరిధిలో సరఫరా నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు.

వన్య ప్రాణుల సంరక్షణ  అందరి బాధ్యత 1
1/1

వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement