విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలి

Jul 19 2025 1:07 PM | Updated on Jul 19 2025 1:07 PM

విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలి

నిజామాబాద్‌అర్బన్‌: ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలని బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి సూచించారు. సాంకేతిక విద్యాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రా ష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలను శుక్రవారం ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులతో సమావేశమై, ఒక్కో విభాగం వారీగా నమోదైన ఫలితాలు, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై స మీక్షించారు. అనంతరం తరగతి గదులు, వర్క్‌షాప్‌లను సందర్శించి, పనితీరును పరిశీలించారు. వి ద్యార్థులతో భేటీ అయ్యి, వారికి అందిస్తున్న శిక్షణ తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్ర భుత్వ సంకల్పానికి అనుగుణంగా వివిధ డిప్లొమా కోర్సులలో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థులు చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా బోధనా సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. పాలిటెక్ని క్‌ కాలేజీలకు మౌలిక సదుపాయాలు, అవసరమైన బోధనా సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం ఉత్తీర్ణత సాధిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రతిభను కొలమానంగా గుర్తిస్తూ ఆయా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణారెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగాల పో టీ పరీక్షలలో నెగ్గుకురావాలంటే ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ రమేశ్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, బోధనా సిబ్బంది ఉన్నారు.

ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌

వినయ్‌ కృష్ణారెడ్డి

సాంకేతిక విద్యాభివృద్ధికి

సీఎం రేవంత్‌రెడ్డి ప్రాధాన్యం

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement