
క్రమశిక్షణ, సమయ పాలనే ప్రధానం
బోధన్: ఎన్‌సీసీ విద్యార్థులకు క్రమ శిక్షణ, సమయపాలన అత్యంత ప్రాధాన్యమని నిజామాబాద్ ఎన్‌సీసీ బెటాలియన్ కమాండెంట్ కల్నల్ విష్ణు నాయర్ అన్నారు. బోధన్ శివారులోని ఆచన్‌పల్లి ప్రాంతంలోగల ఇందూర్ హైస్కూల్‌లో శుక్రవారం ఎన్‌సీసీ ‘ఏ’ కాడెట్లకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు ఎన్‌సీసీ శిక్షణలో నైపుణ్యం సాధించి సైనికులుగా దేశానికి సేవలందించే అవకాశం ఉంటుందన్నారు. పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్‌సీసీ యూనిట్ ద్వారా అనేక విద్యార్థులు శిక్షణ పొంది ఆర్మీలోని వివిధ హోదాల్లో పని చేస్తున్నారన్నారు. 44 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. 50 మంది విద్యార్థులను కొత్తగా నమోదు చేసుకున్నారు. హెచ్‌ఎం రామారావు, ఎన్‌సీసీ సిబ్బంది సుబేదార్ అనూజ్‌రాణ, బీహెచ్‌ఎం సతీంధర్‌జీత్, హవల్దార్ శ్రీకాంత్,ఏఎన్‌వో సాయిలు, పీఈటీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.