
ఆపరేషన్ టైగర్!
నిజామాబాద్
ప్రజావాణికి ప్రాధాన్యం..
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు.
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో u
సాగునీటి కాలువ పరిశీలన
నవీపేట : ‘గిఫ్ట్ కొంత.. కబ్జా మరింత’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల కేంద్రంలో కబ్జాకు గురవుతున్న సాగు నీటి కాలువను తహసీల్దార్ వెంకటరమణ, ఇరిగేషన్ ఏ ఈ శ్రీధర్ సోమవారం పరిశీలించారు. సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని సర్వేయర్ గోవర్ధన్‌ను తహసీల్దార్ ఆదేశించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
జాతీయ అవార్డుల దరఖాస్తుకు గడువు పొడిగింపు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు 2025 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు డీఈవో అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పోలీస్ ప్రజావాణికి
26 ఫిర్యాదులు
ఖలీల్‌వాడి: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీపీ సాయి చైతన్య సోమవారం ప్ర జావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబందధిత అధికారులకు సూచనలు చేశా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత ఎస్సై, సీ ఐలను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు. పోలీస్ ప్రజావాణికి మొత్తం 26 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.
ఎస్సారెస్పీలోకి
తగ్గిన ఇన్‌ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల్లో వ ర్షాలు తగ్గడంతో ప్రాజెక్ట్‌లోకి 2,172 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీర థ ద్వారా 231, ఆవిరి రూపంలో 359 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1068.70(21.2 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తె లిపారు. గతేడాది ఇదే రోజున 1062.2 (12.90టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
ఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తున్న పులి జాడ కనుక్కోవడం కోసం అటవీ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. రెండు రోజులైనా పులి ఎక్కడుంది, ఎటు వెళ్లిందన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఎస్ 12 పులి కోసం కొనసాగుతున్న గాలింపు
● అడవిలో ఆరు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు
● రెండు డ్రోన్ కెమెరాలతో కదలికలు కనిపెట్టే ప్రయత్నం
● ఎటువైపు వెళ్లిందన్న దానిపై స్పష్టత కరువు
● పులిపై విష ప్రయోగానికి ప్రయత్నించిన నలుగురిపై కేసు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కోసం అటవీ శాఖ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లా అట వీ అధికారి నిఖిత ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి, సిరికొండ, ఇందల్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట రేంజ్‌లకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మూడు బృందాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల పరిధిలోని రెడ్డిపేట, అన్నారం, ఎల్లంపేట, సిరికొండ మండలంలోని కొండాపూర్, తూంపలి తదితర గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో గాలిస్తున్నారు.
ఆరు ట్రాక్ కెమెరాల ఏర్పాటు
పులి కదలికలను కనిపెట్టేందుకు అటవీ ప్రాంతంలో ఆరు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి తిరిగిన ప్రదేశానికి రెండు కిలోమీటర్ల రేడియస్‌లో అన్నివైపులా కవరయ్యేలా కెమెరాలు బిగించినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో పులి ఉంటే కచ్చితంగా కెమెరాలు ట్రాక్ చేస్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే రెండు డ్రోన్ కెమెరాలతో అడవిలో తిరుగుతూ పులి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే దాకా గాలింపు కొనసాగింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సిబ్బంది అటవీ ప్రాంతంలోనే ఉండి పులి జాడ కోసం ప్రయత్నించారు.
అదుపులో ముగ్గురు!
రెడ్డిపేట స్కూల్ తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. అయితే ఆవు యజమానితో పాటు మరో ముగ్గురు ఆవుపై పురుగుమందులు చల్లి పులిని మట్టుబెట్టే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు.
ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. విషప్రయోగం నిర్ధారణ కోసం శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
రాత్రింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్ ..
● నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
డాక్టర్ భూపతిరెడ్డి
● మహిళా సంఘాలకు
వడ్డీ లేని రుణాలు పంపిణీ
న్యూస్‌రీల్
రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు
వర్షాకాలం కావడంతో అడవి పచ్చబడింది. ముళ్ల పొదలు, చెట్లు పెరిగి అడవిలో తిరగడానికి అటవీ అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతు న్నారు. పులిని గుర్తించడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఎస్ 12 పులిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు అడవుల్లో తిరుగుతూ దాని కదలికలను పసిగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పులి ఏ వైపు వెళ్లింది అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా జిల్లాలో పులుల సంచారం లేదు. ఇప్పుడు వచ్చిన పులిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దు. పులిపై విష ప్రయోగం జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చాకే చెప్పగలం.
– నిఖిత, డీఎఫ్‌వో, కామారెడ్డి
ఎస్ 12 నంబరుతో పిలవబడే పులి ఇటీవల జిల్లా సరిహద్దుల్లోని సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో తిరిగి నట్టు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పులి కదలికలను తెలుసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. దాని జాడ కనిపెట్టేందుకు మాచారెడ్డి, ఇందల్వాయి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, సిరికొండ రేంజీలకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పులి కదలికలను గుర్తించే క్రమంలో అడవిని జల్లెడ పడుతున్నారు. సోమవారం జిల్లా అటవీ అధికారి నిఖిత కూడా అటవీ ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. డ్రోన్ కెమెరాల ద్వారా పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఆపరేషన్ టైగర్!

ఆపరేషన్ టైగర్!

ఆపరేషన్ టైగర్!

ఆపరేషన్ టైగర్!

ఆపరేషన్ టైగర్!

ఆపరేషన్ టైగర్!