
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నే తృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా పథకాల ను అమలు చేస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి అన్నారు. ఇందిరా మహిళాశక్తి సంబరాలను నగరశివారులోని బోర్గాం(పి)లో ఉన్న భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, లోన్ బీమా, బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలను లబ్ధిదారులుగా ఎంపిక చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు వారి పేరిట మంజూరు చేస్తున్నామని, రుణ సదుపాయం క ల్పిస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభు త్వం ఏటా రూ.25 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 20,547 మహిళా సంఘాలకు రూ.21.69 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేయగా, రూరల్ నియోజకవర్గంలోని 5781 మహిళా సంఘాలకు రూ.5.91 కోట్ల రుణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వేడుకల్లో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్‌గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు గడ్కో ల్ భాస్కర్‌రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సొసైటీల చైర్మన్లు, జి ల్లా, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.