
పెద్దపులి మొదట వచ్చింది సిరికొండకే..
డొంకేశ్వర్(ఆర్మూర్): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి రేంజ్ పరిధిలో ఆవుపై దాడిచేసి చంపిన పెద్దపులి మొదటగా నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్‌కే వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించిన విషయం తెలిసిందే. తాటిపల్లి అటవీలోనే కొన్ని రోజులు పెద్దపులి సంచరించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొండలు, రాళ్ల గుట్టలు ఎక్కువగా ఉండడంతో మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు భావిస్తున్నారు. అయితే మాచారెడ్డి రేంజ్‌లో పెద్దపులిపై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు రావడం, పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో కూడా హాట్ టాపిక్‌గా మా రింది. పెద్ద పులి మళ్లీ నిజామాబాద్ జిల్లా వైపు రా వొచ్చనే సందేహంతో సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్ సౌత్ రేంజ్‌లను అప్రమత్తం చేశారు. అటవీ పరిసర గ్రామాల ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పెద్దపులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, ఉచ్చులు, విద్యుత్ తీగలు పెట్టకూదని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా నిజామాబాద్ నాగారంలో చిరుత సంచారం నేపథ్యంలో అన్ని రేంజ్‌లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలిచ్చారు.
నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు
ఇందల్వాయి, నిజామాబాద్
సౌత్ రేంజ్‌లలోనూ అప్రమత్తం