
బోనం ఎత్తిన పోచారం
రుద్రూర్: మండల కేంద్రంలో బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బోనం ఎత్తుకుని ఊరేగింపు ప్రారంభించారు. కుల సంఘాల ఆధ్వర్యంలో మహిళలు బోనాలను ఊరేగించి గ్రామ దేవతలకు సమర్పించారు.
రెండో టౌన్ ఎస్సైగా ముజాహిద్
ఖలీల్‌వాడి: నగరంలో రెండో టౌన్ ఎస్సైగా సయ్యద్ ముజాహిద్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా మావల పీఎస్ నుంచి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పై మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదివరకు పనిచేసిన ఎస్సై ఇమ్రాన్ బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.
జిల్లాలో పౌర సన్మానం
పొందిన ‘కోట’
నిజామాబాద్ రూరల్: విలక్షణ నటుడిగా పేరు పొందిన కోట శ్రీనివాస్‌కు ఇందూరు నగరంతో అనుబంధం ఉందని ప్రముఖ నాటక ప్రయోక్త శ్రీపాద కుమార శర్మ అన్నారు. అనారోగ్యంతో కోట శ్రీనివాస్ ఆదివారం మృతి చెందారని, ఆయన మృతి సినీరంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. 2012లో ఇందూరులో శ్రీపాద నాటక కళా పరిషత్ నాటక పోటీలు జరిగాయని వీటికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోట శ్రీనివాస్‌రావును పౌర సన్మానం చేసినట్లు తెలిపారు. చిత్రపరిశ్రమ గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు విచారం వ్యక్తం చేశారు. చంద్రశేఖర శర్మ, వీపీ చందన్ రావు, సంస్కార భారతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సముద్రాల మధుసూదన చారి, తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీశ్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ ప్రేమ్‌లాల్ ఆయన మృతికి సంతాపం తెలిపారు.
బోధన్‌వాసికి
స్వర్ణ కంకణ పురస్కారం
బోధన్‌టౌన్: జ్యోతిష్య శాస్త్రంలో విశేష కృషి చేస్తున్న బోధన వాస్తవ్యుడైన యోగిరాజ్ వైద్యకు స్వర్ణ కంకణ పురస్కారం లభించింది. ఆదివారం వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన తెలుగు సంస్కృతి, సాహితి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానసభలో తెలుగు సాహితి బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు యోగిరాజ్‌కు స్వర్ణ కంకణ పురస్కారం అందించారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రముఖులు పాల్గొన్నారు.

బోనం ఎత్తిన పోచారం

బోనం ఎత్తిన పోచారం

బోనం ఎత్తిన పోచారం