
పీజీ ప్రవేశాలకు సీపీగెట్
తెయూ(డిచ్‌పల్లి): డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు ఉ న్నత విద్యలో భాగంగా పీజీ కోర్సులు చదివేందుకు ఉన్నత విద్యామండలి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్) నిర్వహిస్తోంది. అందులో భాగంగా జూన్ 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా, అపరాధ రుసుము లేకుండా ఈ నెల 17 వరకు తు ది గడువుగా ప్రకటించారు. ఆగస్ట్ మొదటి వారం నుంచి ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో (ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూహెచ్, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ) ప్రవేశాలు పొందవచ్చు.
తెలంగాణ యూనివర్సిటీలో..
జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిచ్‌పల్లి మెయిన్ క్యాంపస్, కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌లోని సౌత్ క్యాంపస్‌లో మొత్తం 26 కోర్సులలో 820 అందుబాటులో ఉన్నాయి. ఇందులో రెండేళ్ల పీజీ కోర్సులతోపాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులున్నాయి. మెయిన్ క్యాంపస్‌లో ఎంఏ (తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాస్ కమ్యూనికేషన్), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఐఎంబీఏ, ఎం.కామ్(ఈ–కామర్స్), ఎంఎస్సీ మ్యాథ్స్, బోటని, కెమిస్ట్రీ (స్పెషలైజేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ), కెమిస్ట్రీ (స్పెషలైజేషన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ పీజీ కోర్సులున్నాయి. భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో ఎంఏ (హిస్టరీ, తెలుగు (కంపారిటివ్ లిటరేచర్), పొలిటికల్ సైన్స్, ఎంఎస్‌డబ్ల్యూ (సోషల్ వర్క్), ఎంఎస్సీ కెమిస్ట్రీ (స్పెషలైజేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ), ఫిజిక్స్(స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్స్), జియో ఇన్ఫర్మెటిక్స్, జువాలజీ కోర్సులున్నాయి.
మార్పులు, చేర్పులకు 17.07.2025
నుంచి 20.07.2025 వరకు
రూ.500 అపరాధ రుసుముతో
24.07.2025 వరకు
రూ.2000ల అపరాధ రుసుముతో 28.07.2025 వరకు
www.cpget.tsche.ac.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తుకు ఐదు రోజులే గడువు
తెయూలో 820 సీట్లు