
రాష్ట్రస్థాయి చెస్‌కు ఎంపిక
నిజామాబాద్‌నాగారం: జిల్లాస్థాయి అండర్ – 13 చెస్ టోర్నీని(బాలబాలికలు) జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని అభ్యాస స్కూల్‌లో శనివారం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభకనబర్చిన వా రిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమానికి ముఖ్య అథితిగా నవీపేట్ ఎంఈవో అశోక్ హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. విజేతలుగా నిలిచిన త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్, లక్ష్మణ్, ఆర్బిటర్ వైభవ్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు,.
విజేతలు వీరే..
బాలుర విభాగం : టి శివానంద్(కేవీఎస్), టి సాయిరుద్ర(విశ్వోదయ)
బాలికల విభాగం : కె నాగ జోష్నిక, సహస్ర(ప్రెసిడెన్సీ).