
ఓటరు నమోదు సక్రమంగా నిర్వహించాలి
రుద్రూర్: ఓటరు నమోదు ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో శుక్రవారం కోటగిరి ఉమ్మడి మండలాల బీఎల్‌వోలకు అసెంబ్లీ స్థాయి మాస్ట ర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆమె వెంట తహసీల్దార్ గంగాధర్, డిప్యూటీ తహసీల్దార్ అజీజ్, ట్రైనర్లు నరహరి, అశోక్ తదితరులు ఉన్నారు.
చేపపిల్లల ఉత్పత్తి షురూ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తిని శుక్రవారం ప్రారంభించారు. కేంద్రంలో గతం నుంచి ఉన్న జార్ హెచరీలతోపాటు ఎకో హెచరీలలో చేపగుడ్లను పొదగవేసి బాయిల్డ్ ప్రక్రియ మొదలుపెట్టారు. చేపపిల్లల ఉత్పత్తికి అధికారులు నె ల రోజుల నుంచి తల్లి చేపలను సేకరించా రు. ఈ కేంద్రానికి 5 కోట్ల చేపపిల్లలను ఉ త్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మొదట తల్లి చే పల నుంచి సేకరించిన గుడ్లను హెచరీలో పొదగ వేసి బాయిల్డ్ చేస్తారు. మూడు రోజు ల తర్వాత స్పాన్ విడుదలవుతుంది. స్పాన్ నుంచి చేపపిల్లలు ఉత్పత్తి అవుతాయి. వాటిని సిమెంట్ కుండీలో నిల్వ ఉంచి అంగుళం సైజ్ పెరిగిన తర్వాత మత్స్య సహకా ర సంఘాలకు సబ్సిడీపై సరఫరా చేస్తారు. నాణ్యమైన చేపపిల్లల ఉత్పత్తి చేపడుతామని మత్స్యశాఖ ఏడీ ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో మత్స్య అభివృద్ధి అధికారి దామోదర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆధునిక సాంకేతికతతో కేసులు పరిష్కరించాలి
● సీపీ సాయి చైతన్య
● పోలీస్ స్టేషన్ రైటర్లకు
శిక్షణ ప్రారంభం
ఖలీల్‌వాడి: ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగి స్తూ కేసులను పరిష్కరించాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో పోలీస్‌స్టేషన్ రైటర్లకు శుక్రవారం ఆయన శిక్షణ ప్రారంభించారు. సీపీ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసుల ఛేదనలో పరిపక్వతను సాధించాలన్నారు. కేసుల పరిశోధనలో నాణ్యతను పెంచి ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జ్‌షీట్ రిపోర్టు వరకు పాటించాల్సిన మెళకువలను వివరించారు. నూతన చట్టాలు, టెక్నాలజీపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్ సైన్స్ వాడకం, కోర్టు లో వేసే చార్జ్‌షీట్ తయారీ విధానాన్ని తెలి పారు. శిక్షణ అనంతరం సంబంధిత పీఎస్‌కు వెళ్లిన తర్వాత సిబ్బందికి, సంబంధిత అధికారికి శిక్షణ కాలంలో నేర్చుకున్న అంశాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో ని జామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రైనింగ్ సీటీసీ ఏసీపీ మస్తాన్ అలీ, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రూ.43 లక్షల
గుట్కా పట్టివేత?
ఖలీల్‌వాడి: నగరంలోని అర్సపల్లి, ఆటోనగర్ ప్రాంతంలోని ఓ గోదాంలో నిల్వ చేసిన రూ. 43 లక్షల విలువ చేసే గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. భారీగా ఉన్న గుట్కాకు జీఎస్‌టీ చెల్లించలేదని, దీంతో పోలీస్ ఉన్నతాధికారులు గుట్కాను పరిశీలించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేక జీఎస్టీతో సరిపెడతారా? అనే ప్రశ్నలు తలెత్తుత్తున్నాయి. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

ఓటరు నమోదు సక్రమంగా నిర్వహించాలి

ఓటరు నమోదు సక్రమంగా నిర్వహించాలి