
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సన్నద్ధం
నిజామాబాద్‌నాగారం: చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్న పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను అందించేందుకు అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఖాళీల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది. పోస్టుల భర్తీకి కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించి ప్రత్యేక కమిటీ ద్వారా నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు.
అర్హతలు ఇవే..
ఇది వరకు ఆయాగా విధులు నిర్వహిస్తున్న వారికి అర్హత ఉండి టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పదోన్నతుల ద్వారా పూర్తిచేశారు. గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు 10వ తరగతి అర్హత ఉండేది. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసిన వారు మా త్రమే టీచర్ పోస్టుకు దరఖాస్తులు చేసుకోవాలి. ఆయా పోస్టులకు 7వ తరగతి ఆపై చదువుకున్న వారు కూడా అర్హులు. దీంతో నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ మహిళలు ఎదురుచూస్తున్నారు.
త్వరలో విడుదలకానున్న నోటిఫికేషన్
జిల్లాలో మొత్తం 680 ఖాళీలు
గైడ్‌లైన్స్ రాగానే భర్తీ చేస్తాం
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులకు సంబంధించిన ఖాళీల జాబితా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ రాగానే నియమ, నిబంధనల ప్రకారం భర్తీకి చర్యలు తీసుకుంటాం. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం.
– రసూల్‌బీ, జిల్లా సంక్షేమాధికారి
జిల్లాలో ఖాళీలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఐదు సీడీపీవో కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ ఉ న్నాయి. వీటి పరిధిలో 1500 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, జిల్లా వ్యాప్తంగా 75 అంగన్‌వాడీ టీచ ర్లు, 605 ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారులు ఇప్పటికే ఖాళీల జాబితా సిద్ధంగా ఉంచారు. కాగా, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పదవీ విరమణ వయ స్సు 65 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. వయస్సుపై బడినవారు పదవీ విరమణ చేస్తే మరిన్ని పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది.