
జనాభా నియంత్రణకు కృషి చేయాలి
నిజామాబాద్‌నాగారం: జనాభా నియంత్రణకు ప్ర తి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ప్రతి మహిళ శరీరం, మనసు సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడానికి సరైన సమయమని అన్నారు. మాతా శిశు మరణాలకు, జనాభా పెరుగుదలకు కారణమైన బాల్య వివాహాలను చేసుకోవద్దన్నారు. అర్హులైన దంపతులందరూ శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించేలా ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు అవగాహన కల్పించాలని సూచించారు. పురుషుల కోసం ఎన్‌ఎస్‌వీ/వెసక్టమీ ఆపరేషన్లు ఆర్మూర్, డిచ్‌పల్లి, మోర్తాడ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అంజనా, జిల్లా మలేరియా అధికారి తుకారం రాథోడ్, పీవోఎంసీహెచ్ సుప్రియ, పీవోఎన్‌సీడీ సామ్రాట్ యాదవ్, పీహెచ్‌సీ వైద్యాధికారిణి శిఖర, డెమో నాగలక్ష్మి, డీహెచ్‌ఈలు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో రాజశ్రీ