శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం | - | Sakshi
Sakshi News home page

శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం

Jul 12 2025 7:19 AM | Updated on Jul 12 2025 11:27 AM

శ్రీర

శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం

కామారెడ్డి జిల్లా రామా రెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శివలింగాన్ని స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించి, కొలిచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

● శ్రీరాముడు వనవాసంలో ఉండగా ఇక్కడ లింగంను ప్రతిష్ఠించి, పూజలు చేశాడు. నాటి శివలింగమే నేడు బుగ్గ రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు.

● మాఘ అమావాస్య రోజున ఈ ఆలయం వద్ద పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తులు భారీగా తరలివస్తారు.

● మహా శివరాత్రి పర్వదినం నాడు బుగ్గ రామలింగేశ్వరుడిని లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. శివపార్వతుల కల్యాణోత్సవం, రథోత్సవం మర్నాడు అగ్ని గుండాలు నిర్వహిస్తారు.

● బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో 2005 నుంచి నేటి వరకు నిత్యాన్నదానం నిరంతరంగా కొనసాగుతుంది.

● గ్రామస్తులందరు కలిసి స్వయంగా రెండు నెలల రేషన్‌ బియ్యాన్ని అన్నదానానికి విరాళంగా అందజేస్తారు.

● బుగ్గ రామలింగేశ్వర ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమంలో వందమంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు.

● 70 ఆవులను ఆలయం ఆధ్వర్యంలో పోషిస్తున్నారు.

● కామారెడ్డి నుంచి నేరుగా బుగ్గ రామలింగేశ్వరుడి ఆలయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.

– రామారెడ్డి

మీకు తెలుసా?

శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం1
1/1

శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement