
ఎస్సారెస్పీలో 20 టీఎంసీలు దాటిన నీటినిల్వ
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 20 టీఎంసీలు దాటింది. ప్రస్తుత సంవత్సరం మేలో కురిసిన అకాల వర్షాల నుంచి ప్రాజెక్ట్‌లోకి వరద నీరు ప్రారంభమైంది. ప్రసుతం ప్రాజెక్ట్ స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్ట్‌లోకి 4,309 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్ట్‌లోకి జూన్ 1నుంచి ఇప్పటి వరకు 10 టీఎంసీల వరద నీరు వచ్చిచేరింది. కాలువల ద్వారా, ఆవిరి రూపంలో ఇప్పటి వరకు 2.26 టీఎంసీల నీటిని వదిలారు. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 359 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1068.30(20.63 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే రోజున ప్రాజెక్ట్‌లో 1061.90(12.44 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది.
ఎగువ ప్రాంతాల నుంచి
కొనసాగుతున్న వరద