
చట్టాలపై అవగాహన ఉండాలి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): విద్యార్థులు విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు సూచించారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల/ కళాశాలలో శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు తోటివారితో కలిసి మెలిసి ఉండాలని, ర్యాగింగ్ పేరుతో కలహాలు సృష్టించుకోరాదని సూచించారు. పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతకుముందు మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని గురుకుల సిబ్బందికి సూచించారు. మండల ప్రత్యేకాధికారి యోహాన్, మండల పరిషత్ అధికారి శ్రీనివాస్‌గౌడ్, ప్రిన్సిపాళ్లు దివ్యరాణి, లక్ష్మీ, అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ నిరోష, శ్రావణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.