
కల్లుడిపోల తనిఖీ
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఒకటవ, రెండవ, మూడవ కల్లు డిపోలను ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి గురువారం తనిఖీ చేశారు. ఈ డిపోలకు ఉన్న ఈతవనాలను తనిఖీలు చేశారు. వీటి నుంచి వచ్చిన కల్లు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలాగే డిపోలకు సంబంధించిన లైసెన్స్‌లను పరిశీలించి, ఎంత వరకు పర్మిషన్ ఉందో వివరాలను అడిగి తెలుసుకోవాలన్నారు. అక్కడ తయారైన కల్లుకు టెస్ట్‌లు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్లు తయారుచేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. స్వచ్ఛమైన కల్లును మాత్రమే విక్రయించాలని డిపోలోని గీతా కార్మికులకు సూచించారు. అలాగే నిజామాబాద్ రూరల్ పరిధిలోని మల్లారం గ్రామంగల 16 ఎకరాల్లో ఉన్న ఈతవనాలను పరిశీలించారు. ఇక్కడ నుంచి ఎన్ని లీటర్ల కల్లు వస్తుంది అనే వివరాలను తెలుసుకున్నారు. కల్లు డిపోలకు 8,600 చెట్లు ట్యాపింగ్ అలాట్‌మెంట్ అయినట్లు పేర్కొన్నారు. సుమారు 46 మంది ముస్తేదారులు ప్రతిరోజు ఈత వనం నుంచి కల్లుగీస్తున్నట్లు గీతకార్మికులు డీసీకి వివరించారు. హైదరాబాద్‌లోని కల్తీకల్లు ఘటన సందర్బంగా కల్లుడిపోలను ఎకై ్సజ్ అధికారులు పరిశీలించినట్లు ప్రచారం జరుగుతుంది. ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌చార్జి ఏడీ స్వప్న, ఇన్‌చార్జి ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌వో సుస్మిత, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.