ఉమ్మడిగానే జీవిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడిగానే జీవిద్దాం

Jul 11 2025 12:40 PM | Updated on Jul 11 2025 12:40 PM

ఉమ్మడ

ఉమ్మడిగానే జీవిద్దాం

అన్యోన్య కుటుంబం‘ గుప్తా బ్రదర్స్‌’

బోధన్‌: బోధన్‌ పట్టణంలోని హెడ్‌పోస్టాఫీస్‌ ప్రాంతానికి చెందిన చిదుర గుప్తా బ్రదర్స్‌ ఉమ్మడి కుటుంబం వివిధ వ్యాపారాల్లో స్థిరపడి ప్రత్యేక గుర్తింపు పొందింది. మూడు తరాల కుటుంబ సభ్యులు ఒకే చోట ఉంటున్నారు. పట్టణ కేంద్రానికి చెందిన చిదుర గంగాధర్‌ గుప్తా–సరస్వతీ దంపతులకు ప్రతాప్‌ గుప్తా, ప్రదీప్‌ గుప్తా, ఇద్దరు కూతుర్లు ఉండగా, అందరి వివాహాలయ్యాయి. ప్రతాప్‌ గుప్తాకు ఆయన సతీమణి ఉమా, కూతురు, కొడుకు, కోడలు, మనుమడున్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహాలు అయ్యాయి. ప్రదీప్‌గుప్తాకు సతీమణి పద్మ, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. ఓ కూతురు వివాహం చేశారు. ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి మొత్తం 9 మంది కుటుంబ సభ్యులు ఒకే చోట ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. పలు వ్యాపార దుకాణాలు, సంస్థలకు గుప్తా బ్రదర్స్‌ పేరు పెట్టారు. ఆర్యసమాజ్‌, అనేక సామాజిక సేవ కార్యక్రమాల్లో ఇద్దరు అన్నదమ్ములు పాల్గొంటున్నారు. చిదుర గంగాధర్‌ గుప్తా, ఆయన సతీమణి కొంతకాలం క్రితం సహజ మరణం పొందారు. గంగాధర్‌ గుప్తా తమ్ముడు రాజలింగం కుటుంబం కలిసి ఉండేవారు. ఉమ్మడిగా జీవించడం వల్ల కుటుంబ సభ్యులు కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారని, బంధుత్వం బలపడుతుందని వీరు పేర్కొంటున్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఉమ్మడి కుటుంబమే ఉత్తమమని పలువురు పేర్కొంటున్నారు. ఉమ్మడి కుటుంబంతోపాటు సంతానం ఎక్కువగా ఉంటే బంధాలు మరింత బలపడతాయని చెబుతున్నప్పటికీ, మారిన జీవన విధానం, ఖర్చుల పెరుగుదలతో ఒకరిద్దరినే కంటామని యువ జంటలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభా దినోత్సవం నేపథ్యంలో సాక్షి నిర్వహించిన సర్వేలో పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేశారు.

చిన్న కుటుంబమే సురక్షితం

బోధన్‌: చిన్న కుటుంబాలే సురక్షితంగా, భద్రత, భ రోసాలతో ఉంటాయని బోధన్‌ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాలెంకర్‌ అరుణ్‌కుమార్‌–సౌమ్య దంపతులంటున్నారు. కుటుంబ ఆదాయ వనరులు, పిల్లల చదువులు, ఆరోగ్యం, పెళ్లిళ్లలను దృష్టిలో పెట్టుకుని ఇ ద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆర్థిక ఇ బ్బందులు ఎదుర్కొనే పరిస్థితులుంటాయని పేర్కొన్నారు. పిల్లలు పుట్టిన నాటి నుంచి చదువులతో పాటు వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వరకు త ల్లిదండ్రులకు ఆర్థికంగా భారం ఉంటుందన్నారు. అరుణ్‌ కుమార్‌ దంపతులకు ఇద్దరు కూతుర్లు లా స్య(16) లహరి(14) ఉన్నారు. మూడో సంతానం కోసం ఆలోచన చేయలేదు. ఆయన ప్రస్తుతం సా లూర జెడ్పీహెచ్‌ఎస్‌లో హిందీ సబ్జెక్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

మూడుతరాలుగా..

బోధన్‌: బోధన్‌ పట్టణంలోని గోశాల రోడ్డు ప్రాంతానికి చెందిన మంచాల లక్ష్మణ్‌ (90) (లడ్డు సేట్‌) ది మధ్యతరగతి వ్యాపార ఉమ్మడి కుటుంబం. మూ డుతరాల కుటుంబ సభ్యులు కలిసి ఉంటున్నారు. మంచాల లక్ష్మణ్‌ తల్లిదండ్రులు భూమయ్య, భూదే వి కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి బోధన్‌కు వచ్చి స్థిరపడ్డారు. భూమయ్య దంపతులకు ముగ్గురు సంతానం మంచాల లక్ష్మణ్‌, పెంటయ్య, భద్రాచలం. పెద్ద కుమారుడైన లక్ష్మణ్‌కు ఆరుగురు కుమారులు, కూతురు ఉన్నారు.అందరి పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు– కోడళ్లు స్వామి– నిర్మల, శ్రీనివాస్‌–సునీత, శంకర్‌–చైతన్య, అశోక్‌–కవిత, దశరఽథ్‌ –వాణి, శరత్‌–పవిత్ర దంపతులకు మొత్తం పది మంది పిల్లలున్నారు. లక్ష్మణ్‌ రెండో సోదరుడు పెంటయ్యకు భార్య, కొడుకు, మూడో సోదరుడు భద్రాచలం కు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. లక్ష్మణ్‌ ఇటీవల మృతి చెందగా గతంలో ఆయన సతీమణి చనిపోయారు. మూడో సోదరుడు భద్రాచలం కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మంచాల ఉమ్మడి కుటుంబంలో ప్రస్తుతం మొత్తం 26 మంది ఉంటారు. కుటుంబ సభ్యులు వివిధ చిరువ్యాపారాలు, ప్రైవేట్‌ స్కూల్స్‌లో టీచర్లుగా పని చేస్తూ ఒకే ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. సమష్టి నిర్ణయంతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు.

ఉమ్మడిగానే జీవిద్దాం1
1/2

ఉమ్మడిగానే జీవిద్దాం

ఉమ్మడిగానే జీవిద్దాం2
2/2

ఉమ్మడిగానే జీవిద్దాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement